ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తో జట్లకు లాభమా.. నష్టమా.. గడిచిన మ్యాచ్లను పరిశీలిస్తే..!

ఐపీఎల్ సీజన్-16 లో ( IPL 16 ) కొత్తగా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్( Impact Player Rule ) అమలులోకి వచ్చింది.ఈ సీజన్లో ఐదు మ్యాచ్లు పూర్తయ్యాయి.

 How Much Impact Have The Impact Players In Ipl 2023 Matches Details, Impact Pla-TeluguStop.com

ఈ సీజన్ లో పాల్గొనే 10 జట్లు తమ మొదటి మ్యాచ్ ను ఆడేశాయి.కొన్ని జట్లు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వాడేశాయి.

ఈ రూల్ తో లాభ పడ్డాయా లేదా నష్టపోయాయో చూద్దాం.

ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అంటే మ్యాచ్ జరుగుతున్నప్పుడు మధ్యలో ఒక ఆటగాడి స్థానంలో మరో ఆటగాడిని తీసుకొని ఆడించడమే ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్.

అయితే మొదట బ్యాటింగ్ చేసిన జట్టు.ఫీల్డింగ్ చేసే సమయంలో బౌలర్ గా ఛాన్స్ ఇవ్వడం, మొదట ఫీల్డింగ్ చేసిన జట్టు.బ్యాటింగ్ చేసే సమయంలో మరో బ్యాటర్ కు ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

1.గుజరాత్- చెన్నై మధ్య జరిగిన మ్యాచ్ లో చెన్నై జట్టు అంబటి రాయుడు( Ambati Rayudu ) స్థానంలో తుషార్ దేశ్ పాండేను ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకుంది.తుషార్ 3.2 ఓవర్లలో 51 పరుగులు ఇచ్చి, కేవలం ఒక వికెట్ తీశాడు.తుషార్ వల్ల చెన్నై జట్టు కంటే గుజరాత్ జట్టునే లాభ పడింది.

Telugu Ambati Rayudu, Impact Rule, Impact, Ipl, Ipl Matches, Ipl Impact, Rajapak

2.పంజాబ్- కలకత్తా మధ్య జరిగిన మ్యాచ్ లో భానుకా రాజపక్స స్థానంలో రిషి ధావన్ వచ్చి ఒక్క ఓవర్లో 15 పరుగులు ఇచ్చాడు.

3.రాజస్థాన్- సన్రైజర్స్ మ్యాచ్లో పడిక్కల్ స్థానంలో వచ్చిన నవదీప్ సైనీ ఏకంగా రెండు ఓవర్లలో 34 పరుగులు ఇచ్చాడు.

4.ముంబై- బెంగుళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ స్థానంలో వచ్చిన జేసన్ బెహ్రండార్ఫ్ మూడు ఓవర్లు వేసి 37 పరుగులు ఇచ్చాడు.

Telugu Ambati Rayudu, Impact Rule, Impact, Ipl, Ipl Matches, Ipl Impact, Rajapak

5.లక్నో – ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్లో లక్నో జట్టు ఆయుష్ బధోని స్థానంలో వచ్చిన కృష్ణప్ప గౌతమ్ కూడా విఫలమయ్యాడు.

ఇంపాక్ట్ ప్లేయర్ తీసుకుంటే మ్యాచ్ కీలక మలుపు తిరిగి, మంచి విజయం ఖాతాలో వేసుకోవాలి.కానీ ఇంపాక్ట్ ప్లేయర్ల వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా జరిగింది.

గడిచిన ఐదు మ్యాచ్లలో ఇంపాక్ట్ ప్లేయర్ల ప్రభావం శూన్యం.పైగా ఇంపాక్ట్ ప్లేయర్ ల వల్ల జట్లు ఓటమిని ఖాతాలో వేసుకున్నాయి.

ఇది ఇంపాక్ట్ ప్లేయర్లుగా వచ్చిన బౌలర్ల పరిస్థితి.ఇక బ్యాటర్లుగా వచ్చిన వారు కూడా చెప్పుకోదగ్గ గొప్ప ప్రదర్శన చేయలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube