భర్త చెంప పగలగొట్టిన హీరోయిన్.. వైరల్ వీడియో!

ఒకప్పటి తెలుగు సినీ నటి అనిత పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులకే కాదు బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయం ఉన్న నటి.నువ్వు నేను సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అనిత ఆ తర్వాత పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు అందుకుంది.

 Viral Video Actress Anita Hassanandani Slapped Her Husband , Anita Hassanandani,-TeluguStop.com

ఇక తను 2013లో ప్రముఖ వ్యాపారవేత్త రోహిత్ రెడ్డి ని పెళ్లి చేసుకొని తెలుగు సినీ పరిశ్రమకు దూరం అయింది.

తన పెళ్లి తర్వాత మొత్తానికి బాలీవుడ్ వైపు అడుగులు పెట్టి అక్కడే సెటిల్ అయింది.

బుల్లితెరలో కూడా నటించింది.ఇక ఇటీవల తను పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను అభిమానులతో బాగా పంచుకుంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఓ ప్రాంక్ చేస్తూ ఏకంగా తన భర్త చెంప పగలకొట్టింది.

తాజాగా తన ఇన్స్ స్టా గ్రామ్ ఖాతాలో ఓ వీడియో షేర్ చేయగా.

అందులో అనిత తన భర్తను కుర్చీలో కూర్చోబెట్టి, అతడి వెనకాల నిల్చొని ఓ దారాన్ని పట్టుకున్నట్లు నటించింది.

ఇక ఆ దారాన్ని అతడి చెవిలో నుండి తీస్తున్నట్లు చేయగా.వెంటనే అతని చెంప పగల కొట్టింది.దీంతో తన భర్త షాక్ అవుతూ.

అక్కడినుంచి వెళ్లిపోతూ తనని ఇలా ఆడుకునేందుకు ఊరుకునేది లేదంటూ, త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటాం అంటూ వార్నింగ్ ఇచ్చాడు రోహిత్.ఇక అనిత.

భార్యలకు ఈ మ్యాజిక్ ట్రిక్ తప్పకుండా నచ్చుతుందని.ఈ ట్రిక్ ని తప్పకుండా ఇంట్లో ప్రయత్నించండి అంటూ క్యాప్షన్ కూడా జోడి చేసింది.

ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా నెటిజనులు రకరకాల ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube