రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్( Vijayendra Prasad ) తనపై, తన సినిమాలపై వచ్చే ఆరోపణల గురించి స్పందించి సమాధానం ఇచ్చే విషయంలో ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే.రాజమౌళి( Rajamouli ) సినిమాలకు సంబంధించి చాలా సన్నివేశాలు కాపీ అని కామెంట్లు వినిపిస్తూ ఉంటాయి.
హాలీవుడ్ సినిమాల నుంచి జక్కన్న స్పూర్తి పొందుతారని చెబుతూ కొన్ని వీడియోలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుంటాయి.
అయితే గతంలోనే ఈ కామెంట్ల గురించి స్పందించిన విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కథ చెప్పిన తర్వాత సినిమాకు సంబంధించి నా జోక్యం ఉండదని ఆయన అన్నారు.రైటర్, డైరెక్టర్ మధ్య మంచి రిలేషన్ ఉంటే సినిమా బాగుంటుందని విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.
ఈరోజు నచ్చిన సీన్ పదేళ్ల తర్వాత నచ్చకపోవచ్చని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.
నేను చాలా తక్కువగా సినిమాలు చూస్తానని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.బేసిక్ ఎమోషన్స్ పదో పెన్నెండో ఉంటాయని ఆయన తెలిపారు.బాహుబలి1 కు( Baahubali 1 ) రాజమౌళి చాలా టెన్షన్ పడ్డారని విజయేంద్ర ప్రసాద్ కామెంట్లు చేయడం గమనార్హం.బాహుబలి రిలీజ్ తర్వాత కొవ్వూరులో పుష్కరాలకు వెళ్తే అక్కడ అందరూ బాహుబలి గురించి మాట్లాడుకుంటున్నారని ఆయన వెల్లడించడం గమనార్హం.
బౌండెడ్ స్క్రిప్ట్ తో రాజమౌళి తీస్తాడని చిన్న చిన్న మార్పులు మాత్రం తర్వాత చేస్తాడని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.కేకేయి పాత్ర శివగామి పాత్రకు స్పూర్తిగా ఉండవచ్చని ఆయన కామెంట్లు చేశారు.రామాయణం, మహాభారతం చిన్నప్పటి నుంచి బ్లడ్ లో ఉన్నాయని విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.
రమ్యకృష్ణ శివగామి పాత్రకు( Shivagami Role ) బాగుంటుందని ఊహించానని ఆయన అన్నారు.అవంతిక పాత్రకు తమన్నా సూట్ కాదని అనుకున్నానని కానీ ఆమె ఆ పాత్రకు న్యాయం చేసిందని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించడం గమనార్హం.