సాధారణంగా ఎలుగుబంట్లను( Bears ) చూస్తేనే భయమేస్తుంది.ఎందుకంటే అవి క్రూరమైన మాంసాహారులు, మనుషులను కూడా చంపేయగలవు.
అయితే ఇటీవల ఒక వ్యక్తి మాత్రం పెద్ద నల్లటి ఎలుగుబంటిని చూసి ఏమాత్రం భయపడలేదు.పైగా దానిని చిన్న కుక్క పిల్లను తరిమినట్లు తరిమేశాడు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.వివరాల్లోకి వెళితే, ఇటీవల మైక్( Mike ) అనే వ్యక్తి పెన్సిల్వేనియాలోని క్యాంప్‌సైట్‌లో ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు.
అదే సమయంలో పిలవని అతిథిగా క్యాంప్‌సైట్‌లోకి ఎలుగుబంటి వచ్చింది.అది చాలా పెద్దగా ఉంది, దాంతో చాలామంది హాడలిపోయారు.కానీ మైక్ మాత్రమే ఎలాంటి టెన్షన్ పడకుండా చాలా కామ్ గా ఎలుగుబంటితో మాట్లాడటం మొదలుపెట్టాడు.“హేయ్, మా క్యాంప్‌సైట్‌లో నీకేం పనే, బయటికి వెళ్లదురా” అంటూ అతడు దానిని రిక్వెస్ట్ చేశాడు.
అయితే అతడు చెప్పినట్లే వింటూ ఎలుగుబంటి క్యాంపు సైట్ ఎంట్రెన్స్ దగ్గరికి వచ్చింది.అయితే అతడు చివరగా కోపంగా దాన్ని బయటికి వెళ్లిపో అని అరిచేశాడు.దాంతో మాటలు జాగ్రత్త అన్నట్లు తన పంజాతో ఎలుగుబంటి అతన్ని చిన్నగా కొట్టింది.ఆ దృశ్యం చూసి అది దాడి చేస్తుందేమోనని స్నేహితులు చాలా భయపడ్డారు.
గట్టిగా అరి చేశారు కూడా.అయినా మైక్ భయపడలేదు, పారిపోలేదు.“ఇంకా ఎంతసేపు బయటికి వెళ్లిపో” అని అతడు దానిని ఇంకాస్త తిట్టాడు.దాంతో ఎలుగుబంటి క్యాంపు సైట్ నుంచి బయటికి వెళ్లిపోయింది.
అనంతరం అతడు దాని గేట్ క్లోజ్ చేశాడు.
మైక్ ప్రవర్తనపై పలువురు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వీడియోపై కామెంట్స్ చేస్తున్నారు.ఆయన ధైర్యం, సంయమనం పాటిస్తున్నారని కొందరంటే.మరికొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాపాయానికి గురయ్యారని విమర్శించారు.
కొంతమంది పరిస్థితిపై జోకులు, మీమ్స్ కూడా చేసారు.అందరినీ ఆశ్చర్యపరుస్తున్న ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.