టాలీవుడ్ లో ఇప్పటివరకు పరాజయం ఎరుగని డైరెక్టర్ ఎవరు అంటే దర్శకుడు రాజమౌళి( Director Rajamouli ) పేరు వినిపిస్తూ ఉంటుంది.అలాగే కోలీవుడ్లో పరాజయం ఎరుగని దర్శకులు ఎవరు అంటే ముందుగా స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్( Vetrimaaran ) పేరే వినిపిస్తూ ఉంటుంది.
ఇప్పటివరకు వెట్రిమారన్ తెరకెక్కించిన సినిమాలు అన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచాయి.తాజాగా వెట్రిమారన్ దర్శకత్వం వహించిన విడుతలై సినిమా కూడా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాను తెలుగులో గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ విడుదల చేయబోతున్నారు.
ఇందుకు సంబంధించిన పార్ట్ 1 ఏప్రిల్ 15న విడుదల కానుంది.ఈ సందర్భంగా ఈ సినిమాను తెలుగులో ప్రమోషన్స్ చేయడానికి వెట్రిమారన్ హైదరాబాద్ వచ్చారు.ఈ సందర్భంగా వెట్రిమారన్ మాట్లాడుతూ ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ ని తెలిపారు.
గత కొద్ది రోజులుగా టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ), వెట్రిమారన్ దర్శకత్వంలో నటిస్తున్నాడు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా ఆ వార్తలపై స్పందించారు.
ఆడుకులం సినిమా సమయంలో నేను, బన్నీ చెన్నైలో మీట్ అయ్యాము.అల్లు అర్జున్( Allu Arjun ) తమిళ్ లో ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాను మీ దగ్గర కథ ఉంటే చెప్పండి అని నాతో అన్నారు.
నేను అప్పుడే వడా చెన్నై స్టోరీ లైన్ చెప్పాను.ఆ తరువాత నాకే అది అంత సెట్ అవ్వదు అనిపించి ఆపేశాను అని చెప్పుకొచ్చారు వెట్రిమారన్.కరోనా సమయంలో అసురన్ మూవీ తర్వాత అల్లు అర్జున్ ఎన్టీఆర్ ఇద్దరినీ కలిశాను.ఎన్టీఆర్ కి కూడా కథ వినిపించాను.దాన్ని ఇంకా ముందుకు తీసుకు వెళ్ళాలి అందుకు చాలా సమయం ఉంది అని చెప్పాడు అని చెప్పుకొచ్చారు వెట్రిమారన్. అల్లు అర్జున్ ఎన్టీఆర్ తో మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారా అని ప్రశ్నించగా ఏమో ఉండొచ్చు అంటూ షాక్ ఇచ్చాడు.
ఒకవేళ నిజంగానే ఎన్టీఆర్ అల్లు అర్జున్ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కితే అభిమానులకు అంతకంటే పండగ మరొకటి ఉండదని చెప్పవచ్చు.