కోలీవుడ్ లో కొత్త రికార్డ్ సెట్ చేసిన వంశీ పైడిపల్లి!

ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ ‘వారిసు’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.కోలీవుడ్ లో భారీ అంచనాలను నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్ టాక్ తెచుకున్నప్పటికీ పండుగ రోజుల్లో కలెక్షన్స్ తో అదరగొట్టింది.

 Vamshi Paidipally Proves His Mettle In Kollywood Details, Vamsi Paidipally, Koll-TeluguStop.com

ఈ సినిమా జనవరి 11న తెలుగులో తప్ప మిగిలిన అన్ని చోట్ల గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.

ఇక ఈ క్రేజీ సినిమాను దిల్ రాజు భారీ స్థాయిలో శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై పాన్ ఇండియా సినిమాగా నిర్మించాడు.తెలుగులో ఈ సినిమా జనవరి 14న రిలీజ్ అయ్యింది.

ఇక్కడ కూడా బాగానే ఆకట్టుకుంది.ఇక మన తెలుగు డైరెక్టర్ వంశీ తమిళ్ డెబ్యూ ఇది.

దీంతో ఈయన తమిళ్ లో ఎలాంటి హిట్ అందుకుంటాడా అని ఆసక్తిగా ఎదురు చూసారు.ముందు నుండి ఈ సినిమాపై మన తెలుగులో విమర్శలు వస్తూనే ఉన్నాయి.మహర్షి సినిమాను పోలి ఉందని ట్రోల్స్ చేసారు.అయితే విజయ్ స్టార్ హీరో కావడం ఇలాంటి కథలు తమిళ్ లో రాకపోవడం వల్ల అక్కడ సూపర్ హిట్ అయ్యింది.

ఏకంగా ఈ సినిమా 200 కోట్ల మార్క్ దాటేసి రికార్డ్ క్రియేట్ చేసింది.

ఇక ఈ సినిమా విజయంతో వంశీ పైడిపల్లి కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ సాధించిన మొదటి డైరెక్టర్ గా రికార్డ్ క్రియేట్ చేసాడు.ఈయన మొదటి సినిమాతోనే కోలీవుడ్ ప్రేక్షకులను అలరించడంతో మరిన్ని సినిమాలు అక్కడ చేయాలనీ తమిళ్ ప్రజలు కోరుకుంటున్నారు.మరి ఈయన తదుపరి సినిమా గురించి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ విషయాలు తెలియాలంటే మరికొంత కాలం ఎదురు చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube