దేశం బయట ఉన్నా ప్రవాసులకు.. వార్నింగ్ ఇచ్చిన కువైట్ సర్కార్..

చాలా దేశాల నుంచి ప్రజలు జీవన ఆధారం కోసం వేరే దేశాలకు వలసలు వెళుతూ ఉంటారు.అలా వలస వెళ్లిన వలసదారులకు కువైత్ ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది.

 Kuwait Government Has Given A Warning To Expatriates Even If They Are Outside Th-TeluguStop.com

ప్రవాసులు ఆరు నెలలకు మించి వేరే దేశాలలో ఉండకూడదని వెల్లడించింది.గడువు కంటే ముందే వచ్చేయాలని హెచ్చరించింది.

ఒకవేళ ఆరు నెలల కాలం పరిమితికి దాటి దేశం బయట ఉంటే వారి రెసిడెన్సి ఆటోమేటిక్గా క్యాన్సల్ అవుతుందని తెలిపింది.ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని కూడా వెల్లడించింది.

ఈ మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ మీడియా డైరెక్టర్ జనరల్ మేనేజర్ జనరల్ తౌహీద్ అల్ కందారి వెల్లడించారు.ఇంకా చెప్పాలంటే మంత్రిత్వ శాఖలోని నివాస వ్యవహారాల విభాగంలో ఆరు గవర్నరేట్లలోని నివాస విభాగాల ద్వారా ప్రవాసులకు సెలవుల కోసం అభ్యర్థనను స్వీకరిస్తుందని వెల్లడించారు.అంతేకాకుండా ఆర్టికల్ 22 నివాస అనుమతిని కలిగి ఉన్న వలస విద్యార్థులు ఎవరైనా దేశం వెలుపల తమ చదువును పూర్తి చేసుకున్నారో, వారి రిజిస్టర్ అయిన విశ్వవిద్యాలయం నుంచి ధ్రువపత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది అని వెల్లడించారు.

అప్పుడే వారు ఆరు నెలల కంటే ఎక్కువ కాలం దేశం బయట ఉండడానికి అనుమతి కోసం వారి సంరక్షకుల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.అంతేకాకుండా సంబంధిత దేశంలోని కువైత్ రాయబార కార్యాలయం ద్వారా కూడా ధ్రువీకరించబడాలని వెల్లడించారు.ఈ సందర్భంగా ఆర్టికల్ 17 పరిధిలోకి వచ్చే వారి నివాస ఎలక్ట్రానిక్ రద్దును జాతీయత మరియు నివాస వ్యవహారాల విభాగం ప్రారంభిస్తుందని అంతర్గత మంత్రిత్వ శాఖ పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ మీడియా డిపార్ట్మెంట్ మూడు నెలల క్రితం ప్రకటించినట్లు ఖండారి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube