జనవరి 21 న మౌని అమావాస్య రోజు ఈ పనులు చేస్తే.. శని దోషాల నుంచి విముక్తి పొందవచ్చా..

హిందూ మత సంప్రదాయాలలో మౌని అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఈసారి జనవరి 21వ తేదీన మౌని అమావాస్య వచ్చింది.

 Rituals On Mauni Amavasya To Get Rid Of Shani Effects Details, Rituals ,mauni Am-TeluguStop.com

అమావాస్య శనివారమే ఉండడంతో మౌని అమావాస్య కూడా శనివారమే జరుపుకుంటారు.మాఘ మాసంలో వచ్చే ఈ మౌని అమావాస్య రోజు దానం చేయడం వల్ల శని దోషాలు దూరం అయిపోతాయి.

అంతేకాకుండా నదులలో స్నానం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది.

శని అమావాస్య సమయంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో స్నానాలు చేయడం మంచిది.

అంతేకాకుండా త్రివేణి సంగమం తీర్థయాత్రలకు వెళ్లి పుణ్య స్నానం చేస్తే పుణ్యఫలం దక్కుతుందని భక్తులు నమ్ముతారు.ఈసారి మాఘ మాసంలో ఐదు శనివారాలు ఉంటాయని జ్యోతిష్య పండితులు వెల్లడించారు.

ఈ ఐదు శనివారాలలో పేదవారికి దానధర్మాలు చేయడం కూడా ఎంతో మంచి పని.మాఘ మాసంలో కృష్ణ పక్షా అమావాస్య జనవరి 21 ఉదయం 6:17 నిమిషల నుంచి మొదలవుతుంది.

ఇది జనవరి 22 మధ్యాహ్నం రెండు గంటల 22 నిమిషముల వరకు ఉంటుంది.ఉదయ తిధి జరుపుకొని ఈనెల 21నే మౌని అమావాస్యను జరుపుకుంటూ ఉంటారు.ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో నది స్నానం చేసి దానం చేస్తే ఎప్పటికీ తరగని పుణ్యం లభిస్తుంది.పురాణాల ప్రకారం మౌని అమావాస్య రోజు సంగమ స్నానం చేయడం వల్ల ఎప్పటికీ విష్ణువు అనుగ్రహం మీపై ఉంటుంది.

మౌని అమావాస్య మాఘమాసంలో మాత్రమే జరుపుకుంటారు.అందువల్ల ఈ రోజున గంగా స్నానం చేయడం వల్ల మనిషికి మోక్షం లభిస్తుంది.శని దోషం పోవాలంటే మౌని అమావాస్య రోజు పాత దుస్తులు, చెప్పులు, బూట్లు పారేయండి.నల్ల నువ్వులు, నల్ల మినుములు, నూనె, దుప్పటి, నల్ల గుడ్డ, ఉక్కు పాత్ర మీకంటే పేదవారికి దానం చేయడం మంచిది.

దాని వల్ల శని దోషాలు నుంచి విముక్తి పొందుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube