పొలం దున్ని నాట్లు వేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు..

మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తన స్వగ్రామం పర్వతగిరిలోని సొంత పొలంలో పనులు జరుగుతుంటే చూసి, వెంటనే పొలంలోకి దిగి… గొర్రు పట్టి ఎడ్లను సై అన్నారు.మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అందరితో కలిసి.

 Minister Errabelli Dayakar Rao Turns Farmer Details, Minister Errabelli Dayakar-TeluguStop.com

గొంతు కలిపి నాట్లు వేశారు.దండగ అన్న వ్యవసాయాన్ని సీఎం కేసీఆర్ పండగ చేస్తే.

ఆ వ్యవసాయాన్ని మంత్రులు కూడా పొలంలోకి దిగి బురద గొర్రు కొడుతున్నారని అన్నారు.మా నాయకుని ఆశయ సాధనలో అడుగులు వేస్తాం అనడమే కాదు.

నేరుగా వ్యవసాయం చేస్తాం…రైతు రాజు అయితే… రాజు కూడా రైతు అనే దానిని రుజువు చేస్తున్నారని అన్నారు.

కూలీలు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, అధికారులు, మంత్రులు కూడా ఇష్టంగా వ్యవసాయం చేయడంతో నేడు తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నపూర్ణగా మారిందని పేర్కొన్నారు.గతంలో నెర్రెలు పారిన పొలాలు.స్వరాష్ట్రంలో ఇప్పుడు పచ్చని పంట పొలాలతో కళకళ లాడుతున్నాయని, అన్నదాత కళ్లలో ఆనందం పండిస్తున్నాయని తెలిపారు.

అపర భగీరధుడు కేసీఆర్ ఆలోచనలతో ప్రాజెక్టులు రూపొంది, నీళ్లు పరవళ్ళు తొక్కుతుంటే… చెరువులు కుంటలు, నిండి ఉప్పొంగుతుంటే… మంత్రులు కూడా సొంత పొలాల్లో దిగి వ్యవసాయం చేస్తుంటే…ఊరు వాడ, చేను చెలక మళ్ళీ ప్రాణం పోసుకుని పరవశిస్తున్నాయని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube