బాదం, తేనె క‌లిపి తీసుకుంటే ఎన్ని అద్భుత ప్ర‌యోజ‌నాలో తెలుసా?

న‌ట్స్‌లో ఎన్నో ర‌కాలు ఉన్నాయి.అందులో బాదం ఒక‌టి.

 Do You Know The Amazing Benefits Of Taking Almonds And Honey Together? Almonds,-TeluguStop.com

బాదం ప‌ప్పులు నోటికి రుచిక‌రంగా ఉండ‌ట‌మే కాదు.ఐర‌న్‌, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, కాప‌ర్‌, విట‌మిన్ బి, విట‌మిన్ ఇ, ప్రోటీన్, ఫైబ‌ర్‌తో స‌హా శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్క‌లంగా క‌లిగి ఉంటాయి.

అందుకే ఆరోగ్య ప‌రంగా బాదం బోలెడన్ని ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.అయితే ఈ ప్ర‌యోజ‌నాలు బాదం తీసుకునే విధానంపై కూడా ఆధార‌ప‌డి ఉంటాయి.

ముఖ్యంగా బాదంను తేనెతో క‌లిపి తీసుకుంటే ఎన్నో అద్భ‌తమైన ప్ర‌యోజ‌నాల‌ను త‌మ సొంతం చేసుకోవ‌చ్చు.మ‌రి లేటెందుకు బాదం, తేనె క‌లిపి ఎలా తీసుకోవాలి.? ఎప్పుడు తీసుకోవాలి.? అస‌లు ఈ రెండిటిని క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల వ‌చ్చే లాభాలు ఏంటి.? వంటి విష‌యాలపై ఓ లుక్కేసేయండి.

ముందుగా ఐదు బాదం ప‌ప్పుల‌ను తీసుకుని వేడి నీటిలో వేసి తొక్క‌ను తొల‌గించాలి.

ఇలా తొక్క తొల‌గించిన బాదం ప‌ప్పుల్లో రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసి బాగా క‌లిపి మూత పెట్టి నైట్ అంతా వ‌దిలేయాలి.ఉద‌యాన్నే నాన‌బెట్టుకున్న బాదం ప‌ప్పుల‌ను తేనెతో స‌హా తీసుకోవాలి.

ఈ విధంగా ప్ర‌తి రోజు చేస్తే ఎముక‌లు, కండ‌రాలు దృఢంగా త‌యార‌వుతాయి.మెద‌డు చురుగ్గా మారుతుంది.

ఆలోచ‌న శ‌క్తి, జ్ఞాప‌క శ‌క్తి రెట్టింపు అవుతాయి.అలాగే లైంగిక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అయ్యే వారు బాదం, తేనె క‌లిపి తీసుకుంటే చాలా మంచిది.

అంగస్తంభన, శ్రీఘ్రస్కలనం, వంధ్యత్వం త‌దిత‌ర‌ లైంగిక సమస్యలను బాదం, తేనె కాంబినేష‌న్ దూరం చేస్తుంది.దంప‌తుల్లో లైంగిక సామ‌ర్థ్యాన్ని పెంచి సంతాన స‌మ‌స్య‌ల‌ను సైతం నివారిస్తుంది.

Telugu Almonds, Almonds Honey, Benefitsalmonds, Tips, Honey, Latest-Telugu Healt

అంతేకాదు, బాదం ప‌ప్పుల‌ను తేనెలో నైట్ అంతా నాన‌బెట్టుకుని ఉద‌యాన్నే తీసుకుంటే.వెయిట్ లాస్ అవుతారు.రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌లంగా మారుతుంది.బ్రెస్ట్ క్యాన్స‌ర్‌, ప్రొస్టేట్ క్యాన్స‌ర్, పెద్ద ప్రేగు క్యాన్స‌ర్ ఇలా వివిధ ర‌కాల క్యాన్స‌ర్లు ద‌రి చేర‌కుండా ఉంటాయి.మ‌రియు డిప్రెష‌న్‌, ఒత్తిడి, ఆందోళ‌న వంటి మాసిక స‌మ‌స్య‌లు సైతం ప‌రార్ అవుతాయి.అయితే మ‌ధుమేహం ఉన్న వారు మాత్రం బాదంతో తేనెను క‌లిపి తీసుకోక‌పోవ‌డ‌మే ఉత్త‌మం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube