మన చుట్టుపక్కల ఉండే వారిలో చాలామంది పండుగ సమయాలలో పేదవారికి సహాయం చేస్తుండటం గమనిస్తూనే ఉంటాం.పండుగ వేళల్లో పేద వారి ముఖాల్లో సంతోషాన్ని చూసేందుకు కొందరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉండడం గమనిస్తూనే ఉంటాం.
అయితే చాలా వరకు పండగ పూట ఇంటికి వచ్చిన వారికి తోచినంత సహాయం చేయడం లేకపోతే ఏదైనా గిఫ్ట్ రూపంలో అందజేయడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనబడుతుంది.ఇలాంటి సహాయం తాజాగా అమెరికాలో జరిగింది.
అమెరికా దేశంలో ఓ హోటల్ కస్టమర్ కూడా క్రిస్టమస్ సందర్భంగా తనతో పాటు తన చుట్టూ ఉన్న వారు సంతోషంగా ఉండాలని ఆ హోటల్ సిబ్బందికి వారు ఊహించలేనంత టిప్ ఇచ్చాడు.అతడు భోజనం చేయడానికి వెళ్లిన ఓ రెస్టారెంట్ సిబ్బందికి ఏకంగా 4 లక్షల రూపాయల టిప్ అందించాడు.
ఆ మొత్తాన్ని ఆ రెస్టారెంట్ లో పని చేసే వారు అందరికీ సమానంగా పంచుకోవాలని ఆయన సెలవిచ్చాడు.
కస్టమర్ ఇచ్చిన డబ్బులతో రెస్టారెంట్ సిబ్బంది తెగ సంతోష పడ్డారు.
అంతేకాదు ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు.తాజాగా ఓ వ్యక్తి అమెరికాలోని ఓహోన్ నగరంలో ఉన్న సౌక్ మెడిటేరియన్ రెస్టారెంట్ కి వెళ్ళాడు.
అక్కడ అతను తనకు కావలసిన ఆహార పదార్థాలను ఆర్డర్ చేసి పూర్తిగా ఆస్వాదించాడు.ఇక భోజనం తర్వాత బిల్లు తెచ్చి ఇవ్వగా.
ఆ బిల్లుతో పాటు ఏకంగా అతను 5600 డాలర్ల ను టిప్ అందించాడు.దీంతో ఆ హోటల్ లో పనిచేస్తున్న మొత్తం 28 మంది స్టాఫ్ కు ఒక్కొక్కరికి 200 డాలర్లు దక్కాయి .త్వరలో రాబోతున్న క్రిస్టమస్ సందర్భంగా ఇంత భారీ మొత్తాన్ని వారికి టిప్ గా లభించడంతో వారి సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి.ఆ కస్టమర్ కు ఆ హోటల్ సిబ్బంది ధన్యవాదాలు తెలిపారు.

ఇందులో భాగంగా ఆ హోటల్ చీఫ్ కుక్ మాట్లాడుతూ.2020 సంవత్సరం మా అందరి జీవితాలలో కన్నీళ్ళు మాత్రమే మిగిల్చాయని, పండుగ ఆనందం కూడా లేదని ప్రస్తుతం ఉన్న రోజుల్లో రోజులు ఎలా గడుస్తాయి అన్న సమయంలో ఓ తెలియని వ్యక్తి మమ్మల్ని తన కుటుంబ సభ్యులుగా భావించి మా అందరికీ ఇంత మొత్తం టిప్ ఇవ్వడంతో మాకు ఎంతో సంతోషం కలిగించాడని అతడికి తాము జీవితాంతం కృతజ్ఞతలు తెలియజేస్తామని తెలిపారు.అయితే ఎవరు టిప్ అందించారన్న విషయాన్ని మాత్రం బయట పెట్టవద్దని ఆ హోటల్ సిబ్బందిని కోరినట్లు వారు తెలిపారు.