ఎస్కలేటర్‌ను వెరైటీగా వాడారు.. వారి పనికి ఓ మహిళ మృతి

కొంత మందికి ఏదైనా వెరైటీగా ప్రయత్నించాలని ఉంటుంది.అందరిలా కాకుండా కొంచెం విభిన్నంగా ట్రై చేస్తుంటారు.

 Using Escalator As Conveyor Belt Almost Killed A Woman Viral Video Details, Esca-TeluguStop.com

అలా చేసిన పనులు కొందరికి ప్రాణాంతకంగా మారుతుంటాయి.ప్రస్తుతం అలాంటి ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.మీరు లగేజ్ కన్వేయర్ బెల్ట్‌‌ను చూసే ఉంటారు.దానిపై లగేజీని పెడితే, అలా వెళ్లిపోతుంది.అయితే ఎస్కలేటర్‌ను కన్వేయర్ బెల్ట్‌గా ఉపయోగిస్తే ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఊహించారా.అలాంటి ఓ కొంటె పని ఇద్దరు మహిళలు చేశారు.

మరో మహిళ ప్రాణం తీశారు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ఇటీవల రెడ్డిట్‌లో ఓ వీడియో పోస్ట్ అయింది.అందులో ఇద్దరు స్త్రీలు తమ సూట్‌కేసులను పట్టుకుని వెళ్తుంటారు.అయితే కిందకి దిగుతుండగా ఎస్కలేటర్ పైభాగంలో వాళ్లు ఓ వెరైటీ పని చేశారు.వారు తమ సూట్ కేసును కన్వేయర్ బెల్ట్‌పై పెట్టినట్లు ఆ ఎస్కలేటర్‌పై పెడతారు.

దీంతో అది కిందికి పడిపోతుంది.ఆ సూట్ కేస్ కిందికి వేగంగా జారిపోతుంది.

ఆ వేగానికి ఎస్కలేటర్‌పై నడుస్తున్న ఓ వయసు మళ్లిన మహిళపై ఆ సూట్ కేస్ పడుతుంది.

వేగంగా వచ్చి పడడంతో ఆ వృద్ధ మహిళ ముందుకు పడిపోతుంది.కాసేపటికే ఆమెను స్ట్రెచర్‌పై తీసుకెళ్తారు.అయితే ఆమె చనిపోయింది.

ఈ వీడియో నెట్టింట పెట్టగానే నెటిజన్లు ఆ సూట్‌కేస్‌ను పడేసిన వారిపై ఫైర్ అవుతున్నారు.వారు ఆకతాయితనంగా చేసిన పనికి ఓ మహిళ ప్రాణం కోల్పోయిందని మండిపడుతున్నారు.

ఆ మహిళలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.ఏదైమైనా ఆ ఇద్దరు చేసిన పని విమర్శల పాలవుతోంది.

కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇలాంటి పని జరిగి ఉండేది కాదనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.