US India : యాంటీ ఇండియా కార్యకలాపాలకు అడ్డాగా అమెరికా : ఎఫ్‌బీఐ దృష్టికి తీసుకెళ్లిన ప్రవాస భారతీయులు

సిలికాన్ వ్యాలీలోని ప్రముఖ భారతీయ అమెరికన్ల బృందం.( Indian-Americans ) న్యాయశాఖ, ఎఫ్‌బీఐ, పోలీస్ సీనియర్ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది.

 Us Soil Being Used For Terrorist Activities Against India Community Leaders Tel-TeluguStop.com

భారతదేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలకు( Terrorist Activities ) కొందరు అమెరికా భూభాగాన్ని ఉపయోగించుకుంటున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.కాలిఫోర్నియాలోని హిందువులపై పెరుగుతున్న ద్వేషపూరిత నేరాలపై ఈ వారం న్యాయశాఖ, ఎఫ్‌బీఐ, స్థానిక పోలీస్ సీనియర్ అధికారులతో ఈ బృందం సమావేశం నిర్వహించింది.

సమావేశంలో పాల్గొన్న పలువురు చెబుతున్న దాని ప్రకారం.భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్న వారిపై అమెరికాలో లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నాయని భారతీయ అమెరికన్లు తమ అసంతృఫ్తిని వ్యక్తం చేశారు.

కమ్యూనిటీ నేత అజయ్ జైన్ భూటోరియా( Ajay Jain Bhutoria ) చొరవతో హిందూ, జైన ప్రార్ధనా స్థలాలపై ద్వేషపూరిత నేరాల పెరుగుదల సమస్యను పరిష్కరించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.దీనికి దాదాపు రెండు డజన్ల మంది ప్రముఖ భారతీయ అమెరికన్లు హాజరయ్యారు.

Telugu India, Community, Harpreetsingh, Hindus, India Consulate, Terrorist, Plai

డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ కమ్యూనిటీ రిలేషన్స్ సర్వీస్ నుంచి విన్సెంట్ ప్లెయిర్,( Vincent Plair ) హర్‌ప్రీత్ సింగ్ మోఖాతో( Harpreet Singh Mokha ) పాటు ఎఫ్‌బీఐ అధికారులు, శాన్‌ఫ్రాన్సిస్కో, మిల్‌పిటాస్, ఫ్రీమాంట్, నెవార్క్ పోలీస్ శాఖకు చెందిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.భారతీయ అమెరికన్లపై , ముఖ్యంగా హిందువులపై( Hindus ) ద్వేషపూరిత నేరాలు అకస్మాత్తుగా పెరగడం సమాజంలో చాలా ఆందోళన కలిగిస్తోందని ఇండో అమెరికన్లు వ్యాఖ్యానించారు.ఖలిస్తాన్ మద్ధతుదారులు( Khalistan Supporters ) భారతీయ కిరాణా దుకాణాల వెలుపల ట్రక్కులను పార్క్ చేయడంతో పాటు యువ భారతీయ అమెరికన్లను భయపెడుతున్నట్లు సమావేశంలో ప్రస్తావించారు.

Telugu India, Community, Harpreetsingh, Hindus, India Consulate, Terrorist, Plai

శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌ను తగలబెట్టడానికి ప్రయత్నించిన వారిపై లా ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయాయని, భారతీయ దౌత్యవేత్తలను వారు బహిరంగంగా బెదిరిస్తున్నారని , దాడులు చేస్తామని బహిరంగంగా పిలుపిస్తున్నారని కమ్యూనిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.అమెరికాలో ఖలిస్తాన్ ఉద్యమం గురించి తమకు తెలియదని సీనియర్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు చెప్పారని.ఈ ఉగ్రవాద గ్రూపుల గురించి అవగాహన కల్పించడంలో భారతీయ అమెరికన్లు తమకు సహాయం చేయాలని కోరుతున్నారని కొందరు సభ్యులు పేర్కొన్నారు.

వనరులు, నిధుల కొరత కారణంగా తాము చర్యలు తీసుకోలేకపోతున్నామని చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube