ఉద్యోగ, వ్యాపారాల రీత్యా అమెరికాలో స్థిరపడిన సిక్కు మతస్తులకు ఆ దేశ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.2020 యూఎస్ జనాభా లెక్కల ప్రకారం వారిని ప్రత్యేకమైన జాతిగా గుర్తించనున్నట్లు ఓ సంస్థ ప్రకటించింది.ఈ నిర్ణయం పట్ల శాన్‌డిగో సిక్కు సొసైటీ అధ్యక్షుడు బల్జీత్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు.
తాము ఇందుకోసం ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్నామని.
ఇన్నేళ్లకు ఈ కల నెరవేరింని ఆయన అభిప్రాయపడ్డారు.అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని సిక్కు మతస్తులకే కాకుండా ఇతర మైనారిటీ వర్గాలకు సైతం భవిష్యత్తులో ఇలాంటి ప్రత్యేక గుర్తింపు లభించేందుక ఇది ఒక ఆరంభమని బల్జీత్ వెల్లడించారు.
అమెరికాలోని సిక్కులకు చెందిన ఒక బృందం జనాభా లెక్కల అధికారులతో పలమార్లు సంప్రదింపులు జరిపారు.చివరికి సారిగా గతవారం 6న శాన్‌డిగో నగరంలో సమావేశమయ్యారు.
సిక్కులకు సంబంధించి ఖచ్చితమైన జనాభా లెక్క ఉండాలంటే వారికి ఒక ప్రత్యేకమైన కోడ్ ఉండాలని ఈ భేటీలో తీర్మానించారు.ఈ నేపథ్యంలో సిక్కులకు ప్రత్యేక గుర్తింపు లభించనుందని యూఎస్ సెన్సస్ అధికారి రాన్ జార్మిన్ పేర్కొన్నారు.
ప్రస్తుత అధికారిక లెక్కల ప్రకారం అమెరికాలో 10 లక్షల మంది సిక్కులు ఉన్నట్లు అంచనా.ఈ ప్రత్యేక జాతి నిబంధనకు ఫెడరల్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ప్రపంచంలోని పలు దేశాల్లో స్థిరపడిన సిక్కు సమాజం ఆయా దేశ ప్రభుత్వాలపై తమకు కూడా వర్తింపజేయాలని కోరవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇదిలావుండగా.గత సోమవారం కాలిఫోర్నియా రాష్ట్రం ఆరెంజ్‌వాలేలోని గురుమానేయో గ్రంథ్ గురుద్వారా సాహిబ్ గోడలపై ‘‘వైట్ పవర్’’ అనే అక్షరాలతో పాటు స్విస్తిక్ ముద్రను పెయింట్‌లా వేసివుండటాన్ని పలువురు సిక్కులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై స్థానిక సిక్కు సమాజం మండిపడింది.