వాషింగ్టన్ అత్యున్నత న్యాయస్థానంలో ఇండో అమెరికన్‌కు కీలక పదవి: ట్రంప్ ప్రతిపాదన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి కట్టబెట్టాలని యోచిస్తున్నారు.వాషింగ్టన్ డీసీలోని డిస్ట్రిక్ట్‌ ఆఫ్ కొలంబియా కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ అసోసియేట్ జడ్జిగా ఇండో అమెరికన్ న్యాయ కోవిదుడు విజయ్ శంకర్‌ను నామినేట్ చేయాలని ట్రంప్ భావిస్తున్నారు.

 Us President Donald Trump Says He May Pick Indian-american As Judge For Washingt-TeluguStop.com

అధ్యక్షుని నిర్ణయానికి అమెరికా సెనేట్ ఆమోదముద్ర లభించిన వెంటనే విజయ్ శంకర్ బాధ్యతలు స్వీకరిస్తారు.

డ్యూక్ యూనివర్సిటీ నుంచి బీఏ పట్టా పొందిన విజయ్ శంకర్.

యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా స్కూల్ ఆఫ్ లా నుంచి జ్యూరిస్ డాక్టర్‌గా పట్టా పుచ్చుకున్నారు.అనంతరం అక్కడే వర్జీనియా లా రివ్యూ నోట్స్ ఎడిటర్‌గాను పనిచేశారు.

ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ జడ్జి చెస్టెర్ జే.స్ట్రాబ్ వద్ద లా క్లర్క్‌గా ఉన్నారు.వాషింగ్టన్‌లో ప్రైవేట్ లాయర్‌గా ప్రాక్టీస్ చేసిన విజయ్ శంకర్ .అంతర్జాతీయ స్థాయిలో లా కంపెనీలైన మేయర్ బ్రౌన్, ఎల్ఎల్‌సీ కోవింగ్టన్ అండ్ బర్లింగ్, ఎల్‌ఎల్‌పీలో పనిచేశారు.ప్రస్తుతం డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ క్రిమినల్ విభాగంలో సీనియర్ లిటిగేషన్ కౌన్సెల్‌గానూ, అప్పీలెట్ సెక్షన్ డిప్యూటీ చీఫ్‌గానూ వ్యవహరిస్తున్నారు.

కాగా ఈ ఏడాది ఆరంభంలో భారత సంతతికే చెందిన సరితా కోమటిరెడ్డిని యూఎస్డిస్ట్రిక్ట్‌ కోర్ట్‌ ఫర్‌ ఈస్ట్రన్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ న్యూయార్క్‌ జడ్జిగా నియమించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube