అతిలోక సుందరి శ్రీదేవి ఈ హీరోయిన్ గురించి తెలియని ప్రేక్షకులు ఉన్నారా అంటే గంట సేపు ఆలోచించిన కూడా అందరూ చెప్పే సమాధానం ఎవరూ లేరు అని.అంతలా నాటి తరం ప్రేక్షకుల నుంచి నేటి తరం ప్రేక్షకులకి అందరికీ సుపరిచితురాలిగా కొనసాగింది.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక సెన్సేషన్ శ్రీదేవి అని చెప్పాలి.అంతేకాకుండా ఒకప్పటి ఎన్టీఆర్ దగ్గర నుంచి మొన్నటి చిరంజీవి వరకు కూడా ఎంతో మంది హీరోల సరసన నటించి అందరికీ పర్ఫెక్ట్ జోడి అనిపించుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఈ క్రమంలోనే శ్రీదేవిని అతిలోక సుందరి అని కొంతమంది.క్యూట్ హీరోయిన్ అని మరికొంతమంది ముద్దు పేర్లతో పిలిచి కుంటూ ఉంటారు.
తన అందం అభినయంతో ప్రేక్షకుల్ని మంత్ర ముగ్దుల్ని చేయడమే కాదు ఇక శ్రీదేవి తో ఒక సినిమా చేస్తే చాలు జీవితం ధన్యమైపోయింది అని అనుకునే దర్శకులు కూడా ఎంతోమంది ఉన్నారు.ఇక శ్రీదేవితో కలిసి సినిమా చేసేందుకు ఆస్తులన్నీ కరగా తీసుకున్న నిర్మాతలు కూడా లేకపోలేదు.
ఇక తెలుగు తమిళ కన్నడ సినిమాల్లో నే కాకుండా హిందీలో కూడా ఎన్నో సినిమాల్లో నటించి అక్కడ తనా హవా నడిపించింది శ్రీదేవి.ఇక ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ నిర్మాత బోనీ కపూర్ ను పెళ్లి చేసుకొని సెటిల్ అయింది అన్న విషయం తెలిసిందే.

అయితే శ్రీదేవి బాలీవుడ్లో జుదాయి అనే సినిమాలో నటిస్తున్న సమయంలో శ్రీదేవి జీవితంలో ఒక విషాదకర ఘటన చోటు చేసుకుంది. శ్రీదేవి తల్లి రాజేశ్వరి అనారోగ్యంతో కన్నుమూశారు.అయితే ఇలా చనిపోయినప్పుడు కొడుకులు మాత్రమే తల కొరివి పెట్టాలి అని అప్పట్లో అని చెప్పేవారు.కానీ శ్రీదేవి సవితి సోదరులు ఇక రాజేశ్వరికి తలకొరివి పెట్టేందుకు ముందుకు రాలేదు.
దీంతో ఇక శ్రీదేవి కొడుకులా మారి ఇక సమాజాన్ని ఎదిరించి తన తల్లికి తలకొరివి పెట్టింది.అప్పట్లో ఇది సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.