యూకే : ప్రత్యర్ధి ముఠా సభ్యుడిగా భావించి.. సిక్కు సంతతి యువకుడిని పొడిచి పొడిచి చంపిన గ్యాంగ్

రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవ ఒక అమాయకుడి ప్రాణాన్ని బలితీసుకుంది.యూకేలో ఓ సిక్కు సంతతి యువకుడిని ఇద్దరు యువకులు కత్తితో విచక్షణారహితంగా పొడిచి దారుణంగా హతమార్చారు.

 Uk Sikh Youth Was Stabbed To Death By A Gang, Thinking He Was A Member Of A Riva-TeluguStop.com

వివరాల్లోకి వెళితే.వెస్ట్ లండన్‌లో 16 ఏళ్ల బాలుడిని ప్రత్యర్ధి ముఠాకు చెందిన వ్యక్తిగా భావించి హతమార్చిన ఇద్దరు యువకులను కోర్ట్ దోషులగా నిర్ధారించింది.

సోమవారం ఓల్డ్ బెయిలీలో జరిగిన విచారణ అనంతరం హిల్లింగ్‌డన్‌కు చెందిన 18 ఏళ్ల వనుషాన్ బాలకృష్ణన్, ఇలియాస్ సులేమాన్‌లు రిష్మీత్ సింగ్‌ను హత్య చేసిన కేసులో దోషులుగా తేలారు.

ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆశ్రయం పొందేందుకు తన తల్లి, నానమ్మతో కలిసి 2019 అక్టోబర్‌లో యూకేకు వచ్చిన రిష్మీత్‌ను .ప్రత్యర్ధి ముఠాకు చెందిన వ్యక్తిగా భావించిన ఇద్దరు నిందితులు దాదాపు 15 సార్లు పొడిచి పొడిచి చంపారు.నవంబర్ 24, 2021 రాత్రి.

రిష్మీత్ ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు.ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తులు అతని వైపు పరిగెత్తుకురావడం చూశాడు.

దీంతో భయాందోళనకు గురైన రిష్మీత్ సౌతాల్‌లోని రాలీ రోడ్‌ వైపు పరిగెత్తాడు.

Telugu Uk, Afghanistan, Gulinder, Ilyas Suleman, Sikh Teen, Rishmeet, Uksikh, Lo

అయితే అతనిని వెంబడించిన నిందితులు వెనుక నుంచి 15 సార్లు విచక్షణారహితంగా పొడిచి పారిపోయారని మెట్ పోలీసులు తెలిపారు.27 సెకన్లలోనే అంతా జరిగిపోయిందని వారు వెల్లడించారు.రక్తపు మడుగులో పడివున్న రిష్మీత్‌ను చూసిన స్థానికులు 999కి సమాచారం అందించారు.

దీంతో లండన్ అంబులెన్స్ సర్వీస్ ఘటనాస్థలికి చేరుకుని అత్యవసర చికిత్సను అందించినప్పటికీ, అప్పటికే రిష్మీత్ ప్రాణాలు కోల్పోయాడు.సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు బాలకృష్ణన్, సులేమాన్‌ను అరెస్ట్ చేశారు.

వీరిద్దరికి వచ్చే నెల 28న ఓల్డ్ బెయిలీలో శిక్ష ఖరారు చేయనున్నారు.

Telugu Uk, Afghanistan, Gulinder, Ilyas Suleman, Sikh Teen, Rishmeet, Uksikh, Lo

ఈ ఘటనపై రిష్మీత్ తల్లి గులీందర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఇప్పటికే తాను భర్తను కోల్పోయానని.ఇప్పుడు ఒక్కగానొక్క బిడ్డను కూడా పొగొట్టుకున్నానని కన్నీటి పర్యంతమయ్యారు.

పోలీసుల విచారణతో రిష్మీత్‌కు న్యాయం జరిగిందని.కానీ వారికి శిక్ష కూడా తక్కువేనని గులీందర్ వ్యాఖ్యానించారు.

వారు తనకు జీవితాన్ని దూరం చేశారని.నా రిష్మీత్ మళ్లీ ఇంటికి రాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube