UK gurdwara : ఈస్ట్ ఇంగ్లాండ్‌లో నిర్మాణం పూర్తి చేసుకున్న గురుద్వారా.. ప్రారంభించనున్న కింగ్ చార్లెస్.. !!

తూర్పు ఇంగ్లాండ్‌లోని బెడ్‌ఫోర్డ్‌షైర్‌లో నూతనంగా నిర్మించిన గురుద్వారాను బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III ప్రారంభించనున్నారు.వచ్చే మంగళవారం కింగ్ చార్లెస్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుందని స్థానిక మీడియా కథనాలను ప్రసారం చేసింది.

 Uk : King Charles To Inaugurate Newly-built Gurdwara In Eastern England , Uk, Ki-TeluguStop.com

కరోనా సమయంలో ఈ గురుద్వారాలోని లంగర్ ద్వారా పలువురికి భోజనం , సూప్ అందజేశారు.సిక్కు నేత, బెడ్‌ఫోర్డ్‌షైర్ యూనివర్సిటీలోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ రీసెర్చ్ డైరెక్టర్ ప్రొఫెసర్ గుర్చ్ రంధవా .కింగ్ చార్లెస్‌కు స్వాగతం పలకనున్నారు.

గురుద్వారా నిర్మాణ పనులు 2020లో ప్రారంభమయ్యాయి.

స్థానిక విరాళాల మద్ధతుతో నిర్మించబడిన ఈ గురుద్వారాను… 37 మీటర్ల పొడవు, 32 మీటర్ల వెడల్పుతో మూడు అంతస్తుల్లో సుందరంగా తీర్చిదిద్దారు.ఇక్కడి గురుద్వారాలోని లంగర్ రోజుకు దాదాపు 500 మందికి భోజనాలను అందిస్తోంది.

స్థానిక సిక్కు సంఘం సైతం ప్రతి ఆదివారం టౌన్‌హాల్ వద్ద లూటన్ సిక్కు సూప్ కిచెన్‌ను నిర్వహించడంతో పాటు 150 మందికి భోజనాలను అందిస్తోంది.

Telugu Beddshire, Eastern England, England, Gurch Randhawa, Gurdwara, Charles, L

గురుద్వారాను ప్రారంభించిన అనంతరం సిక్కు పాఠశాలను నిర్వహిస్తున్న వాలంటీర్లతో ముచ్చటిస్తారు కింగ్ చార్లెస్.అలాగే పంజాబీ, సాంప్రదాయ సంగీతం నేర్చుకుంటున్న పిల్లలతోనూ ఆయన సంభాషిస్తారు.కోవిడ్ సమయంలో వైశాఖి వ్యాక్సిన్ క్లినిక్‌ను నడిపిన స్థానిక వైద్యులను కూడా కింగ్ చార్లెస్ కలుస్తారని లూటన్ టుడే నివేదించింది.

ఇకపోతే.em>బ్రిటన్ రాజుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఈ ప్రాంతానికి వస్తున్న కింగ్ చార్లెస్.

లూటన్ ఎయిర్‌పోర్ట్ పార్క్ వే రైల్వే స్టేషన్‌ను సందర్శిస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube