యూకే తమ దేశంలోకి వచ్చే వలస వాసులకోసం ముఖ్యంగా పలు రంగాలలో నిష్ణాతులైన వారికోసం సరికొత్త వీసా విధానాలను ప్రవేశపెడుతోంది.అమెరికాకు వలసలు వెళ్ళే విద్యార్ధులు, ఉద్యోగుల సంఖ్య క్రమేపి తగ్గుముఖం పడుతున్న తరుణంలో వలస వాసులను తమవైపు తిప్పుకునేందుకు వీలుగా గ్లోబల్ టాలెంట్ వీసాను ప్రవేశపెట్టింది.
గతంలో యూకె లో ఉద్యోగాలు చేసేవారి కోసం టైర్ 1 ఎక్సప్షనల్ టాలెంట్ వీసాలు ప్రవేశపెట్టారు అయితే ఆ వీసా స్థానంలో గ్లోబల్ టాలెంట్ వీసాను ప్రవేశపెట్టినట్టుగా యూకె ప్రకటించింది.ఈ వీసాకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు
– ఈ వీసా కోసం దరఖాస్తు పెట్టేవాళ్ళు కనీసం ఉద్యోగ అనుభవం 5 ఏళ్ళు ఉన్నట్టుగా దృవీకరణ పత్రం ఉండాలి అది కూడా సైన్స్, మ్యాధ్స్ , ఆర్ట్స్ తదితర విభాగాలలో అనుభవం ఉండాలి.
– వీసా కోసం దరఖాస్తు చేసేవారు వారి వారి సీనియర్స్ నుంచీ రిఫరెన్స్ లెటర్ తప్పనిసరిగా తీసుకోవాలి.అలాగే సీనియర్స్ నుంచీ రికమండేషన్ లెటర్స్ కూడా తీసుకోవాలి.అలాగే
– యూకే లోని రివ్యూ సంస్థల నుంచీ ఎండార్స్ లేఖ తప్పనిసరిగా ఉండాలి.
ఇలా అన్ని పత్రాలు సిద్దం చేసుకున్న తరువాత ఎండార్స్ మెంట్ లేఖ కోసం యూకె లోని సంస్థలకు దరఖాస్తు చేసుకోవచు.
దరఖాస్తు దారుడు ఎంచుకున్న ఉద్యోగాన్ని బట్టి సంస్థలు నిర్ణయించబడుతాయి.సదరు సంస్థల నుంచీ ఎండార్స్మెంట్ లేఖను పొందిన తరువాత ఈ గ్లోబల్ వీసాకు అప్ప్లై చేసుకోవాలి.అంతేకాదు ఆన్లైన్ లో కూడా ఈ వీసా కోసం అప్ప్లై చేసుకోవచ్చు.ఇలా అప్ప్లై చేసిన తరువాత ఈ ప్రక్రియ మొత్తం పూర్తవడానికి కనీసం 8 వారాల సమయం పడుతుంది.ఇదిలాఉంటే ఈ వీసా పొందిన తరువాత యూకె లో మూడేళ్ళు ఉద్యోగం చేసిన వాళ్ళు యూకె శాశ్వత వీసా కోసం అప్ప్లై చేసుకోవచ్చని యూకె తెలిపింది.
ఎలాంటి నిభందనలు లేవు :

– దరఖాస్తుదారుడి డిపెండెంట్ ఉంటే వారికి కనీస అర్హతలు ఉంటే వారిని కూడా దరఖాస్తు దారుడు తనతో యూకె తీసుకువెళ్లవచ్చు.అంతేకాదు
– దరఖాస్తు దారుడు ఒకే సంస్థలో ఉద్యోగం చేయాలనే రూలు కూడా లేదు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా తనకు నచ్చిన ఉద్యోగం, కంపెనీ, ప్రాంతాన్ని మార్చుకోవచ్చు
– కొన్ని దేశాలు వీసాలు ఇవ్వడానికి కనీస వేతన నిభందన పాటిస్తాయి.యూకె ఈ విషయంలో ఎలాంటి నిభందన విధించలేదు.
యూకే తాజాగా విడుదల చేసిన ఈ గ్లోబల్ టాలెంట్ వీసా కారణంగా తప్పకుండా వలస వాసులు యూకె కు క్యూ కడుతారని అంటున్నారు.ముఖ్యంగా యూకె దృష్టి మొత్తం భారత్ నుంచీ వచ్చే వలస వాసుల మీదనే ఉందని, భారతీయులకు ఈ యూకె తాజాగా వీసా ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు నిపుణులు
.