ఒక పక్క అగ్ర రాజ్యమైన అమెరికా వీసా నిభందనల విషయంలో కటినమైన నిర్ణయాలు తీసుకుంటూ వలసవాసులని కట్టడి చేస్తోంది.తాజాగా అమెరికా కోర్టు సైతం గ్రీన్ కార్డ్ విషయంలో ప్రభుత్వ నిభంధనలకి మద్దతు తెలుపుతూ తీర్పు కూడా చెప్పేసింది.
ఈ పరిస్థితిలలో బ్రిటన్ ప్రభుత్వం మాత్రం ఇందుకు బిన్నంగా వ్యవహరిస్తోంది.తాజాగా అన్ లిమిటెడ్ ఆఫర్ ని బ్రిటన్ ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది.
భారత్ సహా ప్రపంచంలోని అన్ని దేశాలకి చెందిన శాత్రవేత్తలకి, గణిత నిపుణులు, అగ్రశ్రేణి పరిసోధకులకి ఇలా ఎలాంటి వ్రుత్తి నైపుణ్యం ఉన్న వాళ్ళు ఎంతమంది ఎన్ని వీసాలు కోరుకున్నా , ఆలస్యం లేకుండా అన్ని వీసాలు ఇచ్చేందుకు తాము సిద్దమమని ప్రకటించింది.ఈ ప్రకటన చేసింది కూడా ఎవరో కాదు ఆ దేశ ప్రధాని బోరిస్.
ఈ సరికొత్త విధానాన్ని ఫిబ్రవరి 20 నుంచీ అమలు చేయనున్నట్టుగా తెలిపారు.
పరిశోధకులకి,నిపుణులకి తాము ఎప్పుడూ ఆహ్వానం పలుకుతామని తెలిపింది.
అందుకే తమ ప్రభుత్వానికి సైతం మానవ వనరులపై దృష్టి పెట్టాలని తెలిపారు.ముఖ్యంగా భారత్ నుంచీ వచ్చే నిపుణులపై మనం మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు.
అయితే బ్రిటన్ ప్రధాని ఈ ప్రకటన వెనుక భారత సంతతికి చెందిన నోబెల్ బహుమతి గ్రహిత వెంకీ రామకృష్ణన్ కృషి ఉందని తెలుస్తోంది.