అమెరికాలో ఉన్నటువంటి ప్రవాస తెలుగు సంఘాలలో వంగూరి ఫౌండేషన్ ఒకటి.1994 లో ఈ ఫౌండేషన్ స్థాపించారు.ఎటువంటి లాభాపేక్ష లేకుండా తెలుగు సాహిత్యాన్ని, తెలుగు సంస్కృతీ, ధర్మికతని కాపాడటమే ధ్యేయంగా పనిచేస్తున్న ఈ సంస్థ గడించిన 25 ఏళ్ళుగా ఉగాది ఉత్తమ రచన పోటీలని నిర్వహిస్తోంది.ఈ పోటీలకి ఉత్తర అమెరికా మరియు వివిధ దేశాల్లో ఉన్న తెలుగు రచయితలకి ఆహ్వానం పలుకుతోంది.
భారత దేశంలో మినహాయించి మిగిలిన దేశాలలో ఉన్న తెలుగు రచయితలూ అందరికి ఈ ఆహ్వానం ఇస్తున్నామని వంగూరి సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.ఈ పోటీలలో రెండు విభాగాలు ఉంటాయి.
ఒకటి భారత దేశం మినహా మిగిలిన దేశాల వారినుంచీ నూతన ఆముద్రిత రాచాలని ఆహ్వానిస్తున్నారు.ఇందులో ఉత్తమ కధనికనికి రెండు సమాన బహుమతులు ఉంటాయి.
ఒక్కొక్క బహుమతికి 116 డాలర్లు, ఇక ఉత్తమ కవితకి కూడా రెండు సమాన బహుమతులు ఉంటాయి.ఒక్కో బహుమతికి 116 డాలర్లు గా నిర్దేశించారు.
ఇక రెండోవది , మొట్ట మొదటి రచనా విభాగం.చాలా మందికి కధలు, కవితలు రాసే ఆసక్తి ఉండి రాసినా ఎక్కడా కూడా ఎవరూ ప్రచురించని పక్షంలో అలాంటి రచయితలని ప్రోశ్చచించే క్రమంలో ఈ పోటీలని నిర్వహిస్తున్నారు.ఇందులో మొట్టమొదటి కధ, కవితలకి ఒక్కో బహుమతికి 116 డాలర్లు అందివ్వనున్నారు.ఈ పోటీలలో పాల్గొనాలనే కోరిక ఉన్నవాళ్ళు నిభంధనలకి అనుగుణంగా తప్పకుండా పాల్గొనవచ్చు , మీ కధలు, కవితలు అందాల్సిన చివరి తేదీ : మార్చ్- 05-2020.
[email protected] , or [email protected] కి మీ కధలు , కవితలు పంపవచ్చు.