భారతీయ తల్లీబిడ్డలపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో పాటు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన వ్యక్తికి యూఏఈ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది.వివరాల్లోకి వెళితే.
గతేడాది జనవరి 16న దుబాయ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్‌లో భారత సంతతి మహిళ, తన కుమార్తె కలిసి పై ఫ్లోర్‌కి వెళుతోంది.వీరిద్దరితో పాటు ఇదే సమయంలో మరో సూడాన్ జాతీయుడిపై సూడాన్‌కే చెందిన 43 ఏళ్ల నిందితుడు కత్తితో దాడి చేశాడు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులకు తల్లీబిడ్డా రక్తపు మడుగులో ఉండగా.మరో సూడాన్ పౌరుడు అప్పటికే మరణించి కనిపించారు.గాయపడిన వారిద్దరిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.అనంతరం దుండగుడు కత్తితో పాటు పోలీసులకు లొంగిపోయాడు.
విచారణలో భాగంగా సూడాన్ దేశస్తుడిని హత్య చేయడంతో పాటు భారతీయ మహిళ, ఆమె కుమార్తెపై దాడి చేసినట్లు అతను నేరాన్ని అంగీకరించాడు.కుటుంబపరమైన సమస్యల కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురై తాను ఈ నేరానికి పాల్పడ్డట్టు నిందితుడు పేర్కొన్నాడు.
అంతకుముందు భారతీయ మహిళను పోలీసులు విచారించగా.తాను తన కుమార్తెతో కలిసి లిఫ్ట్‌లో ఇంటికి వెళుతుండగా దాడికి గురైనట్లు తెలిపింది.తన కుమార్తెను నేరస్థుడి బారి నుంచి కాపాడటానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆమె భుజానికి, చేతులకు అనేక కత్తిపోటు గాయాలయ్యాయి.సుధీర్ఘ విచారణ అనంతరం ఆదివారం తుది తీర్పు వెలువరించిన న్యాయస్థానం.
నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష విధించింది.శిక్ష పూర్తయిన తర్వాత నిందితుడిని యూఏఈ నుంచి బహిష్కరించాల్సిందిగా ఆదేశించింది.
కాగా దుండగుడి దాడిలో ప్రాణాలు కోల్పోయిన సూడాన్ దేశస్థుడి భార్య మాట్లాడుతూ.తన భర్త భారత్‌లోని బరోడా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందాడు.ఆయన హిందీ అనర్గళంగా మాట్లాడగలరని.భారతీయులంటే ఎంతో ఇష్టమని ఆమె వ్యాఖ్యానించారు.ఎదుటి వారికి సాయం చేయడానికి ఏమాత్రం వెనుకాడరని.ఎంతో మంచి వారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.