అక్కడ బట్టలు ఆరబెడితే భారీ జరిమాన ..!

సాధారణంగా మనం ఊళ్లలో.నగరాల్లో బట్టలు ఆరవేయడం చూస్తుంటాం.

 Uae Abudabi Residents Warned Not To Dry Clothes In Balconies Details, Clothes, F-TeluguStop.com

ఊళ్లలో అయితే ఎక్కడ పడితే అక్కడ ఆరేస్తుంటారు.ఇక నగరాల్లో అయితే.

బాల్కనీలో లేదా టెర్రస్‌ పైన బట్టల ఆరబెడుతుంటారు.అయితే ఓ ప్రాంతంలో మాత్రం అలా బాల్కనీలో బట్టలు ఆరవేస్తే ఫైన్‌ కట్టాల్సివస్తుంది.

బాల్కనీలో బట్టలు ఆరబెట్టవద్దని అధికారులు హెచ్చరికలు జారీచేశారు.నిబంధనలను అతిక్రమిస్తే భారీగా జరిమానా విధించనున్నట్టుగా చెప్పారు.

ఈ వింత రూల్ ఎక్కడనుకుంటూ ఆశ్చర్యపోతున్నారా? ఈ రూల్ యూఏఈ రాజధాని అబుదాబి మున్సిపాల్టీ లోనిది.

అరబ్ దేశాలలో నిబంధనలు కఠినతరంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే.

చిన్న చిన్న తప్పులకు కూడా భారీ శిక్షలు విధిస్తుంటారు.తాజాగా యూఏఈ రాజధాని అబుదాబి మున్సిపాల్టీలో ఇటీవల ఓ కొత్త నిబంధనను విధించారు అధికారులు.

బాల్కనీలో దుస్తులు ఆరేయడం వల్ల నగర అందం దెబ్బతింటుంది కావున ప్రజలు బాల్కనీ లో దుస్తులు ఆరేయకూడదని హెచ్చరికలు చేశారు.ఒక వేళ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 1,000 దిర్హామ్‌లు (భారత కరెన్సీ ప్రకారం రూ.20,000) లేదా అంతకంటే ఎక్కువ జరిమానా విధించే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు.

Telugu Abudabi, Fine, Dry, Latest-Latest News - Telugu

లాండ్రీ డ్రైయింగ్ గానీ, ఎలక్ట్రిక్ డ్రైయర్స్ వాడడం లేదా ఇతర మార్గాల ద్వారా బట్టలు ఇంట్లోనే ఆరబెట్టుకోవాలని అధికారులు చెబుతున్నారు.నేర తీవ్రతను బట్టి అవసరమైతే జైలు శిక్ష కూడా ఉంటుందని అక్కడి అధికారులు పేర్కొన్నారు.దాంతో అబుదాబి ప్రజలకు దిక్కుతోచని స్థితిలో చేసేదేమీ లేక ఇళ్లలోనే దుస్తులు ఆరబెట్టుకుంటున్నట్టు తెలుస్తోంది.

ఒకవేళ తమ హెచ్చరికలను బేఖాతరు చేసి బాల్కనీలో బట్టలు ఆరవేస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు.అందుకే ఈ విషయంలో నగర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

ఈ రూల్ గురించి తెలిసి పలువురు ఆశ్చర్యపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube