పెరుగుతున్న చలి తీవ్రత : అమెరికాకు కోవిడ్ ముప్పు .. ఆసుపత్రులకు రోగుల క్యూ, 14 రాష్ట్రాలకు అలర్ట్

2019 చివరిలో చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి( Corona ) ప్రపంచాన్ని ఎంతగా ఉక్కిరిబిక్కిరి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.గడిచిన నాలుగేళ్ల కాలంలో కోట్లాది మంది ప్రజలు దీని బారినపడగా .

 Us Faces Winter Wave As Covid Hospital Admissions Climb In 14 States Details, Us-TeluguStop.com

లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు.కంటికి కనిపించని ఓ సూక్ష్మజీవి తనకంటే ఎన్నో రెట్లు శక్తివంతుడైన మనిషిని నాలుగు గోడల మధ్య బందీని చేసింది.

నలుగురిలోకి వెళ్లాలంటే భయం.తోటి వ్యక్తి తుమ్మితే టెన్షన్.ఆర్ధిక వ్యవస్ధ చిన్నాభిన్నం కాగా.లక్షలాది మంది రోడ్డునపడ్డారు.ఇలా ఒకటి కాదు.రెండు కాదు ఈ మహమ్మారి వల్ల ఎన్నో దారుణాలు.

అయితే వ్యాక్సిన్( Covid Vaccine ) అందుబాటులోకి రావడంతో కోవిడ్ తీవ్రత తగ్గింది.అయినప్పటికీ కొత్త కొత్త వేరియంట్లు మానవాళిపై దాడి చేస్తూనే వున్నాయి.

శాస్త్రవేత్తలు సైతం కరోనా ముప్పు ఇంకా తప్పిపోలేదని హెచ్చరిస్తూనే వున్నారు.

చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అమెరికాలో( America ) కరోనా కేసులు పెరుగుతున్నాయి .సీడీసీ నివేదిక ప్రకారం 14 రాష్ట్రాల్లో కరోనా లక్షణాలతో రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు.నవంబర్ 11తో ముగిసిన వారంలో 16,239 కొత్త అడ్మిషన్లు నమోదవ్వగా.8.6 శాతం కేసులు పెరిగినట్లు నివేదిక పేర్కొంది.ఎగువ మిడ్‌వెస్ట్, దక్షిణ అట్లాంటిక్‌లోని కొన్ని ప్రాంతాలు , దక్షిణ పర్వత ప్రాంతాలు అధిక స్పైక్‌లను చూశాయి.దేశంలో చల్లని వాతావరణం( Colder Weather ) కారణంగా వైరస్ వ్యాప్తి పెరుగుతున్నట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు.

Telugu Alaska, Colder, Corona, Covid, Hhssecretary, Climb, Iowa, Wave, Vermont-T

చల్లని, పొడి వాతావరణ పరిస్ధితుల్లో కరోనా వైరస్ వృద్ధి చెందుతుందని 2020లో సీడీసీ( CDC ) నిర్వహించిన అధ్యయనంలో తేలింది.ఆ ఏడాది జూన్ చివరి నుంచి కరోనాతో ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా పెరిగింది.సెప్టెంబర్ ప్రారంభంలో ఇది గరిష్ట స్థాయికి చేరగా, అక్టోబర్, నవంబర్ నెలలో 15,000 కేసులతో స్థిరంగా వుంది.కానీ జనవరి 2021న 1,50,600 కేసులతో గరిష్ట స్థాయికి చేరుకుంది.

ప్రస్తుతం వెర్మోంట్,( Vermont ) అయోవా,( Iowa ) అలాస్కా,( Alaska ) మోంటానా, మిన్నెసోటా, వర్జీనియా, టెనస్సీ, విస్కాన్సిన్, నెబ్రాస్కా, నార్త్ డకోటా, న్యూమెక్సీకో, అరిజోనా, వాషింగ్టన్ డీసీలలో ప్రస్తుతం కేసుల పెరుగుదల ఎక్కువగా వుంది.

Telugu Alaska, Colder, Corona, Covid, Hhssecretary, Climb, Iowa, Wave, Vermont-T

ఇకపోతే.యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో అమెరికన్లకు ఫ్రీ కోవిడ్ 19 హోమ్ పరీక్షలను అందించే ప్రోగ్రామ్‌ను పున: ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.కోవిడ్ 19 పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ముగిసిన తర్వాత .ఈ ఏడాది మేలో కార్యక్రమం నిలిపివేయబడింది.ఈ సందర్భంగా హెచ్‌హెచ్ఎస్ సెక్రటరీ జేవియర్ బెసెరా( Xavier Becerra ) వాషింగ్టన్ సీవీఎస్‌ ఫార్మసీలో మాట్లాడుతూ.

సెప్టెంబర్ 25 నుంచి అమెరికన్లు కరోనా పరీక్షలు చేయించుకోవచ్చని తెలిపారు.

అమెరికన్లు Covidtests.

gov నుండి ప్రతి ఇంటికి నాలుగు ఉచిత పరీక్షలను ఆర్డర్ చేయవచ్చు. అమెరికా ప్రభుత్వం Covidtests.

gov ద్వారా ఆర్డర్ చేసిన వ్యక్తులకు ఇప్పటి వరకు 755 మిలియన్లకు పైగా ఉచిత కోవిడ్-19 పరీక్షలను అందించింది.తాజా కార్యక్రమం 2023 చివరి వరకు అందుబాటులో వుంటుందని అమెరికా ప్రభుత్వం తెలిపింది.

హెచ్‌హెచ్ఎస్ దాని అడ్మినిస్ట్రేషన్ ఫర్ స్ట్రాటజిక్ ప్రిపేర్డ్‌నెస్ అండ్ రెస్పాన్స్ వారు కూడా 600 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ‘‘ 12 US COVID-19 test makers ’’ కొనుగోలు చేయనున్నారు.అలాగే 200 మిలియన్ల ఓవర్ ది కౌంటర్ కోవిడ్ 19 పరీక్షలను కొనుగోలు చేస్తామని చెప్పారు.

ఈ నిధులు న్యూజెర్సీ, కాలిఫోర్నియా, టెక్సాస్, వాషింగ్టన్, మేరీల్యాండ్, పెన్సిల్వేనియా, డెలావేర్‌లోని తయారీదారులకు వెళ్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube