తాజాగా ఆస్ట్రేలియాలో ఒక ఇంటిలోని కిచెన్‌లో రెండు కొండచిలువలు సంభోగం చేసుకున్నాయి.ఈ దృశ్యాన్ని చూసి ఆ ఇంటి మహిళా యజమానికి షాక్ అయ్యారు.
అనుమానాస్పదంగా కదులుతున్న మైక్రోవేవ్ ఓవెన్ వెనుక ఏముందో అని చూడగా ఆ ఆస్ట్రేలియన్ మహిళకు వంటగది కౌంటర్‌లో రెండు పెద్ద కొండచిలువలు కనపడ్డాయి.దాంతో ఆమెకు గుండె ఆగినంత పని అయింది.
అనంతరం ఈ షాక్ నుంచి తేరుకున్న ఆమె పాములను పట్టేవారిని పిలిచింది.సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ స్టువర్ట్ మెకెంజీ వెంటనే ఆమె ఇంటికి వచ్చారు.
ఫేస్‌బుక్‌లో తాను ఈ రెండు కొండచిలువలను పట్టుకొని వెళ్ళిపోతున్న వీడియోను షేర్ చేశారు.
క్వీన్స్‌ల్యాండ్ లోని బుడెరిమ్ ప్రాంతంలో చాలా ఇళ్లలో కొండచిలువలను కనిపించడం సహజం, కానీ ఇలా రెండు కొండచిలువలు ఒక ఇంటిలోని కిచెన్‌ని తమ శోభనం గదిగా మార్చుకోవడం మాత్రం చాలా అరుదు.
ఈ రెండు కొండచిలువలలో ఒకటి మొగదైతే మరొకటి ఆడది.ఇవి మైక్రోవేవ్ వెనుక జత కడుతూ కనిపించాయి.ఇవి లైంగిక చర్యలో పాల్గొంటూ కొద్దిసేపు విరామం తీసుకున్న తర్వాత స్నేక్ క్యాచర్ పాములను వేరు చేయకుండా ఒక సంచిలో ఉంచాడు.చివరికి వాటిని అడవిలో విడిచిపెట్టాడు.
దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో చాలామంది షాక్ అవుతున్నారు.“మా ఇంట్లోకే ఇలా రెండు పెద్ద పాములు వచ్చినట్లయితే.మేము ఇకపై అక్కడ ఉండనే ఉండము.ఇలాంటి ప్లేసెస్ లో ఎలా నివసిస్తారో ఏమో, ఇది చూస్తుంటేనే గుండెలో భయం పుడుతోంది” అని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఈ షాకింగ్ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.