మే 20న ఒకటి కాదు రెండు!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.ఆ రోజున తాము ఎంతగానో ఎదురుచూస్తున్న కోరిక నెరవేరనుందని వారు అంటున్నారు.

 Two Gifts From Ntr On May 20, Ntr, Rrr, Rajamouli, Trivikram, Ntr Birthday-TeluguStop.com

తారక్ ప్రస్తుతం నటిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’లోని తారక్ ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అతిభారీ అంచనాలు నెలకొన్నాయి.

కాగా తారక్ పుట్టినరోజున వచ్చే ఫస్ట్ లుక్‌తో అదిరిపోయే సరికొత్త రికార్డును సెట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.కాగా మే 20న తారక్ నుండి వచ్చే బహుమతులు ఒకటి కాదు రెండు అని తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్‌లోని తారక్ ఫస్ట్ లుక్‌తో పాటు ఎన్టీఆర్ 30వ చిత్రం నుండి కూడా ఓ గిఫ్ట్ ఉండబోతుందట.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి కూడా టైటిల్ లేదా టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి మే 20న తారక్ నుండి రెండు బహుమతులు వస్తుండటంతో నందమూరి ఫ్యాన్స్‌లో పండగ వాతావరణం నెలకొంది.ఎలాగూ తమ అభిమాన నటుడి పుట్టినరోజు వేడుకలను లాక్‌డౌన్ కారణంగా పెద్దఎత్తున జరపలేకపోతున్నామని భావించిన వారు, సోషల్ మీడియాలో తమ అభిమాన నటుడి బర్త్‌డేను ట్రెండ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు.

మరి తారక్ నుండి వస్తున్న రెండు గిఫ్టులు ఎలాంటి రికార్డులకు తెరలేపుతాయో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube