రాధేశ్యామ్ ‘జాతకం’ మార్చే అంశం ఇదే!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.

 Twist In Radhe Shyam Movie To Attract Audiences-TeluguStop.com

దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రంలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి.

దీంతో ఈ సినిమా కోసం వారంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమా పూర్వ జన్మల నేపథ్యంలో సాగే కథగా ఉండబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

తాజాగా ఈ సినిమాలో ఉండబోయే ఓ ట్విస్టుకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ సినిమాలో ‘చేతి జాతకం’ అనే అంశం కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది.

హీరోహీరోయిన్లు తమ చేతి జాతకాలు చూపెట్టుకునే సమయంలో వచ్చే ట్విస్టు ఈ సినిమా కథను అమాంతం మార్చేస్తుందని చిత్రపురిలో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది.అంటే.మగధీర చిత్రంలో హీరోహీరోయిన్లు ఒకరి చేతులు మరొకరు తాకినట్లుగా ఈ సినిమాలో చేతి జాతకం ఈ సినిమా కథనే పూర్తిగా మర్చేస్తుందని తెలుస్తోంది.

ఈ వార్తతో సోషల్ మీడియాలో రాధేశ్యామ్ కథ ఇదేనంటూ పలు కథనాలు కనిపిస్తున్నాయి.

ఏదేమైనా ‘జాతకం’ కాన్సెప్టుతో ఈ పీరియాడికల్ రొమాంటిక్ కథను దర్శకుడు రాధాకృష్ణ ఎలా తీర్చిదిద్దాడనేది ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు.

మరి రాధేశ్యామ్ చిత్రంలో ఈ జాతకం కాన్సెప్ట్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube