అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనపరంగా మరో వివాదాస్పద నిర్ణయం వైపుగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.ఇరాన్, సిరియా, లిబియా, వెనిజులా, ఉత్తర కొరియా, యెమెన్, సోమాలియాల జాతీయులను అమెరికాలోకి అడుగుపెట్టనీయకుండా చేయాలని గతంలోనే భావించిన అగ్రరాజ్యాధినేత ఇప్పుడు గట్టి పట్టుదలగా ఉన్నట్లు సమాచారం.
దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనలు వెలువడనప్పటికీ… కొన్ని ముసాయిదా పత్రాలు రెడీ అవుతుండటంతో పాటు మీడియాకు కొన్ని సంకేతాలు అందుతుండటంతో తెర వెనుక ఏదో జరుగుతోందన్న భావన వ్యక్తమవుతోంది.
పైన పేర్కొన్న ఏడు దేశాల పౌరులు అమెరికాలో ప్రవేశించకుండా ట్రావెల్ బ్యాన్ విధించాలని, ఇందుకు సంబంధించి ఇమ్మిగ్రేషన్ విధానాలను కఠినతరం చేయాలని ట్రంప్ భావిస్తున్నారు.
ఇందుకు సంబంధించి అతి త్వరలో కానీ.అధ్యక్ష ఎన్నికలకు సమీపంలో కానీ అధికారిక ప్రకటన వెలువడవచ్చు.కొన్ని దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించేందుకు వైట్ హౌస్ సిద్ధమవుతోందని గతేడాది అక్టోబర్‌లో సీఎన్ఎన్ వార్తా సంస్థ కథనాలు వెలువరించింది.
వీటిపై డెమొక్రాట్ సేన్ క్రిస్ కూన్స్, జూడీ చూ అభ్యంతరం తెలిపారు.ట్రంప్ ముస్లిం వ్యతిరేక విధానాల వల్ల ఇప్పటికే వేలాది కుటుంబాలు ఇప్పటికే నలిగిపోయాయి.ఈ నిర్ణయం కారణంగా అమెరికాలో వున్న వారి జీవిత భాగస్వాములు, తల్లిదండ్రులు, తాతలు, పిల్లలు, తోబుట్టువులు, స్నేహితులను ఇది వేరుచేస్తుందని కూన్స్ తెలిపారు.
ఈ విధానం తప్పని… తాను దానితో పోరాడుతానని ఆయన పేర్కొన్నారు.
200 దేశాలపై సమగ్ర పరిశీలన అనంతరంహోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం.ట్రంప్‌కు పలు దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించాలని సిఫారసు చేసింది.ఈ లిస్టులో ఇరాన్, లిబియా, లిబియా, వెనిజులా, ఉత్తర కొరియా, యెమెన్, సోమాలియా ఉన్నాయి.ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనలిటీ యాక్ట్‌లోని 212 (ఎఫ్) మరియు 215 (ఎ) సెక్షన్లతో పాటు రాజ్యాంగం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చట్టాల ద్వారా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.2017 జనవరిలో ట్రంప్ తొలిసారిగా ఆరు ముస్లిం దేశాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.దీనిని సుప్రీంకోర్టు సైతం సమర్థించింది.