టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ( Tollywood Industry )లో టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్న వారిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు.ఈయనకు ప్రస్తుతం మంచి క్రేజ్ ఉంది అనే చెప్పాలి.
త్రివిక్రమ్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తో SSMB28 తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు.
హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.ఇక ఈ సినిమాలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే( Pooja Hegde ), శ్రీలీల( Sreeleela ) హీరోయిన్ లుగా నటిస్తుండగా.జగపతిబాబు నెగిటివ్ రోల్ లో నటిస్తున్నాడు.ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేస్తున్నారు.ప్రస్తుతం మహేష్ బాబు( Mahesh Babu ) ఈ సినిమాకు కొద్దిగా బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్లిన విషయం తెలిసిందే.ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి కాగా మహేష్ విదేశీ పర్యటన తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది.
మరి త్రివిక్రమ్ వచ్చిన ఈ గ్యాప్ ను స్క్రిప్ట్ కోసం వాడుకుంటున్నారు అని తెలుస్తుంది.
ఈ ఖాళీ సమయంలో త్రివిక్రమ్( Trivikram ) మహేష్ సినిమా స్క్రిప్ట్ కు మరికొంత ఎక్కువ సమయం కేటాయించి మెరుగులు దిద్దుతున్నట్టు తెలుస్తుంది.ఫైనల్ గా ఈ స్క్రిప్ట్ ను బెటర్ గా రావడం కోసం ఈ సమయాన్ని ఉపయోగించు కుంటున్నారట.మొదటి రెండు షెడ్యూల్స్ లో షూట్ చేసిన ఫుటేజ్ ను కూడా పరిశీలిస్తున్నారని మహేష్ వచ్చే వరకు ఇదే పనిలో ఉంటారని టాక్.
చూడాలి ముచ్చటగా మూడవసారి ఈ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందో లేదో.