ఎలక్షన్ కమిషన్ పై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఎలక్షన్ కమిషన్ అధికార పార్టీకి కొమ్ముకాస్తోందని ఆరోపించారు.
బ్యాలెట్ పేపర్ లో జాతీయ పార్టీలకు ముందు స్థానం ఉండాలన్నారు.కానీ టీఆర్ఎస్ కు రెండో స్థానం కేటాయించారు.
అది ఎలా సాధ్యం అని ప్రశ్నించారు.జాతీయ పార్టీల తర్వాత టీఆర్ఎస్ కు నాల్గవ స్థానం కేటాయించాలని తెలిపారు.
ఎన్నికల కమిషన్ బ్యాలెట్ తప్పిదాలను సరిచేయాలని కోరారు.టీఆర్ఎస్, బీజేపీలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా బీజేపీ నేతలు తమపై భౌతిక దాడులు చేస్తున్నారని ఆరోపించారు.