అమెరికాలోని దక్షినాది ప్రాంతాలన్నిటినీ ప్రకృతి గజ గజ వణికేలా చేస్తోంది.భయంకరమైన టోర్నడో తో ఎడతెగని వర్షాలు, పెను గాలులతో జరుగుతున్న విధ్వంసంతో అమెరకా రాష్ట్రం అతలాకుతలం అవుతోంది.
ఇప్పటివరకూ ఈ విధ్వంసం కారణంగా సుమారు 11 మంది చనిపోయారని తెలుస్తోంది.చనిపొయిన వారిలో ఇద్దరు సహాయక సిబ్బంది కూడా ఉన్నారని స్థానిక మీడియా వెల్లడించింది.
లూసియానా లోని ఓ భారీ ఇల్లు ఏకంగా ఈ టోర్నడో ధాటికి సుమారు 200 అడుగులు పైగానే గాలిలోకి ఎగిరి కింద పడిందని ఆ ఇంట్లో ఉంటున్న వృద్ద దంపతులు అక్కడికక్కడే మరణించారని ప్రత్యక్ష సాక్ష్యులు అంటున్నారు.గంటకి సుమారు 217 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు అక్కడి భారీ చెట్లని సైతం వేళ్ళతో సహా పెకలించాయని తెలుస్తోంది.
వాహనాలు సైతం గాలులో చెక్కర్లు కొట్టాయని, విద్యుత్ స్థంబాలు పడిపోయాయని, దాంతో టెక్సాస్ నుంచీ ఒహియో వరకూ అనేక ప్రాంతాలలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది.ఈ ఘటనతో కొన్ని వందల విమాన రాకపోకల్ని నిలిపివేశారని తెలుస్తోంది.పలు చోట్ల రహదాలు దెబ్బ తినడంతో రావణా వ్యవస్థ సైతం ఆగిపోయింది.దాంతో వరదలు వచ్చే ప్రాంతాలని గుర్తించిన అధికారులు వారిని సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు.ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
.