ప్రేమించుకొని పెళ్లి పీటలు ఎక్కని టాలీవుడ్ ప్రేమ జంటలు వీళ్లే?

సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలు చాలా తొందరగా ప్రేమలో పడటం జరుగుతుంది ఇలా ప్రేమలో పడినటువంటి చాలామంది పెళ్లిళ్లు చేసుకునే జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారో అయితే చాలామంది పీకల్లోతు ప్రేమలో మునిగిపోయికోవాలని నిశ్చయించుకొని చివరికి తమ పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నటువంటి సెలబ్రిటీలు కూడా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారని చెప్పాలి.ఇలా ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని భావించి చివరికి విడిపోయినటువంటి ప్రేమ జంటలు ఎవరెవరు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

 Tollywood Love Couples Who Did Not Get Married, Tollywood, Love Couple, Not Get-TeluguStop.com

ఉదయ్ కిరణ్: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు ఉదయ్ కిరణ్ ఒకరు.చిత్రం సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి ఉదయ్ కిరణ్ ( Uday Kiran ) ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఈయన స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయంలోనే మెగా డాటర్ సుస్మిత( Sushmitha ) ను ప్రేమించారు.అయితే వీరి ప్రేమ విషయం పెద్దలకు తెలిసి ఇద్దరికీ పెళ్లి చేయాలనే కూడా నిశ్చయించారు.

నిశ్చితార్థం కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.పెళ్లి తేదీ దగ్గర పడే సమయానికి వీరిద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు వచ్చాయో తెలియదు కానీ తమ పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారు అనంతరం ఉదయ్ కిరణ్ మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు కెరియర్ పరంగా ఫాల్డౌన్ కావడంతో ఆత్మహత్య చేసుకుని మరణించారు.

తరుణ్: ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి తరుణ్ ( Tarun ) ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు.ఈయన నటి ఆర్తి అగర్వాల్ ( Arthi Aggarwal ) తో కలిసి ప్రియమైన నీకు సోగ్గాడు వంటి సినిమాలలో నటించారు.అయితే ఈ సినిమా సమయంలోనే ఇద్దరు ప్రేమించుకున్నారు ఇక వీరిద్దరూ కూడా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు కానీ ఆర్తి అగర్వాల్ ఇంట్లో పెళ్ళికి పోవడంతో వీరిద్దరు పెళ్లి ఆగిపోయింది.ఇక ఆర్తి అగర్వాల్ వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు.

పెళ్లి అయిన తర్వాత ఈమె ఒక సర్జరీ చేయించుకున్నారు అది ఫెయిల్యూర్ కావడంతో ఆర్తి అగర్వాల్ మరణించారు.

నయనతార: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నయనతార( Nayanatara ) ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అయితే ఈమె నటుడు కొరియోగ్రాఫర్ ప్రభుదేవా తో ప్రేమలో పడ్డారు.ఇక వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించి ప్రభుదేవా( Prabhudeva ) మొదటి భార్యకు విడాకులు కూడా ఇచ్చారు అయితే చివరి క్షణంలో వీరిద్దరి మధ్య ఎలాంటి గొడవలు జరిగాయో తెలియదు కానీ పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు.ఇక నయనతార డైరెక్టర్ విగ్నేష్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని తన జీవితంలో సంతోషంగా ఉన్నారు.

అఖిల్: అక్కినేని వారసుడిగా అఖిల్ ( Akhil ) అందరికీ ఎంతో సుపరిచితమే ఈయన శ్రీయ భూపాల్ ( Shriya Bhupal ) అనే అమ్మాయిని ప్రేమించారు.ఇక వీరి ప్రేమ విషయాన్ని పెద్దలకు తెలియజేసి ఎంతో అంగరంగ వైభవంగా నిశ్చితార్థం చేసుకున్నారు.నిశ్చితార్థమైన తర్వాత అఖిల్ శ్రీయ మద్య మనస్పర్ధలు మొదలయ్యాయి దీంతో వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్లకుండా నిశ్చితార్థంతోనే ఆగిపోయింది.

హన్సిక: దేశముదురు సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి హన్సిక ( Hansika ) తమిళ హీరో శింబు( Shimbu ) ప్రేమలో పడ్డారు వీరిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ప్రేమలో ఉన్నారు ఇక వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోవాలని భావించారు కానీ ఇద్దరి మధ్య గొడవలు రావడంతో దూరమయ్యారు.ఇలా శింబుకు దూరమైనటువంటి హన్సిక అనంతరం తన బిజినెస్ పార్ట్నర్ సోహైల్ కతురియా అనే వ్యక్తిని వివాహం చేసుకొని తన జీవితంలో సంతోషంగా ఉన్నారు.

https://www.facebook.com/watch/?extid=WA-UNK-UNK-UNK-AN_GK0T-GK1C&mibextid=5SVze0&v=1017541306018616
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube