ఒకప్పుడు హిందీ సినిమా ( Bollywood )లు సౌత్ ఇండియా లో విడుదల అయ్యేవి.కానీ సౌత్ సినిమా లు కనీసం శాటిలైట్ ద్వారా కూడా హిందీ ప్రేక్షకులు పట్టించుకునే వారు కాదు.
అలాంటిది ఇప్పుడు పూర్తిగా పరిస్థితి మారిపోయింది. టాలీవుడ్( Tollywood ) తో పాటు కోలీవుడ్ సినిమా లకు కూడా హిందీ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.
అయితే అక్కడ ఎంత వరకు వసూళ్లు రాబట్టగలవు అనేది మాత్రం విడుదల అయ్యి వసూళ్లు నమోదు అయ్యే వరకు అనుమానం.మన స్టార్ హీరోల సినిమాలకు మెయిన్ మార్కెట్ మన తెలుగు రాష్ట్రాలే.
ఉత్తరాదిన భారీ ఎత్తున పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్నా కూడా ఇక్కడ వచ్చే వసూళ్లలో కనీసం సగం వసూళ్లు నమోదు కావు.

అయినా కూడా పాన్ ఇండియా సినిమా పాన్ ఇండియా( Pan india ) మార్కెట్ అంటూ మన హీరోలు దూరపు కొండలు నునుపు అన్నట్లుగా అటు వైపు చూస్తున్నారు.ఈ మధ్య కాలంలో కొందరు హీరోలు సినిమాల విడుదల సందర్భంగా ఇక్కడ కంటే కూడా ఎక్కువగా ఉత్తరాదిన ప్రమోషన్ పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు.ఇక్కడ ఇంటర్వ్యూలు ఇచ్చినా ఇవ్వకున్నా కూడా అక్కడ ఎక్కువ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

అక్కడి పీఆర్ టీమ్ లను ఎక్కువగా కలుస్తున్నారు.మొత్తానికి చాలా వరకు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టారు అనిపిస్తోంది.ఇలా అయితే తెలుగు మార్కెట్ పరిస్థితి ఏంటి అంటూ కొందరు విమర్శిస్తున్నారు.అక్కడ ప్రమోషన్ చేసుకోవడం తప్పులేదు.కానీ ఇక్కడ తెలుగు మీడియా లో కంటే కూడా ఎక్కువగా అక్కడ ప్రమోషన్ చేయాలి అనుకోవడం మేఘాలను చూసి ముంతలో నీటిని ఒలకబోయడం వంటిదే అన్నట్లుగా కొందను సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ముందు ముందు అయినా ఈ పద్దతిని మన తెలుగు హీరోలు మార్చుకోవాల్సిన అవసరం ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.