టాలీవుడ్ హీరోల షూట్స్ ఎవరెవరివి ఎక్కడ జరుగుతున్నాయో తెలుసా?

టాలీవుడ్ లో స్టార్ హీరోల నుండి చిన్న హీరోల వరకు ప్రతీ ఒక్కరు తమ లైనప్ తో బిజీ బిజీగా ఉన్నారు.మరి ఏ హీరో ఏ సినిమాలో బిజీగా ఉన్నాడు? అలాగే ఏ సినిమా షూట్ ఎక్కడ జరుగుతుంది అనేది తెలుసుకుందాం.

 Tollywood Heroes New Movies Shooting Updates Balakrishna Prabhas Ntr Ram Charan-TeluguStop.com

ప్రస్తుతం మెగా హీరోలలో కొంత మంది ఒక వారం 10 రోజుల పాటు బ్రేక్ లో ఉన్నట్టు తెలుస్తుంది.ఎందుకంటే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ పెళ్లి కారణంగా అంత ఇటలీ పయనం అయ్యేందుకు సిద్ధం అయ్యారు.

ఇప్పటికే పెళ్లి కొడుకు వరుణ్ తేజ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) దంపతులు అక్కడే ఉన్నారు.గేమ్ ఛేంజర్( Game Changer ) బ్రేక్ రావడంతో రామ్ చరణ్ ముందుగానే అక్కడికి చేరుకొని ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు.

Telugu Salaar, Allu Arjun, Balakrishna, Game Changer, Guntur Karam, Kalki, Prabh

మరో వైపు మాస్ మహారాజ్ రవితేజ,( Raviteja ) బాలయ్య( Balakrishna ) ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు.పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఏ షూటింగ్ లో లేకపోయినా ఇటలీ ఎప్పుడు పయనం అవుతాడో మాత్రం ఇప్పటికి కన్ఫ్యూజన్ గానే ఉంది.ఇక ప్రభాస్( Prabhas ) ఇండియాలో లేకపోయినా సలార్ ప్యాచ్ వర్క్ RFCలో జరుగుతుంది.కల్కి కాస్త బ్రేక్ లో ఉంది.

Telugu Salaar, Allu Arjun, Balakrishna, Game Changer, Guntur Karam, Kalki, Prabh

ఇక ఎన్టీఆర్ దేవర ( NTR Devara ) షూట్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది.మహేష్ గుంటూరు కారం( Guntur Karam ) పోలీస్ అకాడమీలో షూట్ జరుపు కుంటుంది.వెంకటేష్ సైంధవ్ ప్యాచ్ వర్క్ పఠాన్ చెరులో జరుగుతుంది.ఇక అల్లు అర్జున్ పుష్ప 2( Pushpa 2 ) షూట్ లో బిజీగా ఉన్నాడు.మెయిన్ యాక్షన్ సీక్వెన్స్ కు లీడ్ సీన్స్ ను RFCలో షూట్ చేస్తున్నారు.

Telugu Salaar, Allu Arjun, Balakrishna, Game Changer, Guntur Karam, Kalki, Prabh

ఇక దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ షూట్, నాగార్జున సామిరంగా షూట్ కూడా అల్యూమినియం ఫ్యాక్టరీలోనే జరుగుతుంది.నాని, వివేక్ ఆత్రేయ సరిపోదా శనివారం షూట్ జూబ్లీహిల్స్ లో జరుగుతుండగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ షూట్ వాయుపురి కాలనీలో జరుగుతుంది.చివరిగా నితిన్, వెంకీ కుడుముల మూవీ షూట్ కోఠిలో జరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube