ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో ప్రేమ పెళ్లిల జోరు బాగా పెరిగింది.కొన్నేళ్లు వెనక్కి వెళితే నటించిన మొదటి సినిమాతోనే ప్రేమలో పడి ఎవరికి తెలియకుండా ఏళ్లపాటు డేటింగ్ చేసి ఆ తర్వాత పెళ్లి అనే బంధంతో ఒక్కటై తమ జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్న సెలబ్స్ చాలా మంది ఉన్నారు.
అయితే కొంతమంది విడాకులతో వేరుపడిన కొంతమంది జంటలు మాత్రం సాఫీగానే జీవిస్తున్నారు.అలా నటించిన మొదటి సినిమాతోనే ప్రేమలో పడిన ఆ హీరో హీరోయిన్స్ ఎవరు ? వారు నటించిన ఆ మొదటి సినిమా ఏంటి ? ఆ ప్రేమ కహాని ఏంటి ? అనే విషయాలను ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
రాజశేఖర్ – జీవిత
వీరు 1987లో తలంబ్రాలు అనే సినిమాలో మొట్టమొదటిసారి కలిసి నటించారు.ఈ సినిమాతో పాటు కొన్నేళ్ల పాటు వీరి ఫ్రెండ్షిప్ బాగానే సాగింది.
ఆ తర్వాత ఎప్పుడు ప్రేమలో పడ్డారో తెలియదు కానీ ఒకరిని నిలిచి ఒకరు ఉండలేని పరిస్థితికి వచ్చి ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఒకటయ్యారు.ఇప్పుడు ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు.వారు కూడా హీరోయిన్స్ గా తెలుగు సినిమా రంగంలోకి అడుగు పెట్టారు.
ఊహ – శ్రీకాంత్
టాలీవుడ్ లో మోస్ట్ క్యూట్ కపుల్ అయిన ఊహ మరియు శ్రీకాంత్ ఆమె అనే సినిమాతో మొట్టమొదటిసారి పరిచయం అయ్యారు.1994లో వచ్చిన ఈ సినిమాతో తొలిసారి నటించి ఆ తర్వాత ప్రేమలో పడ్డారు.ఇక పెద్దల ఆశీర్వాదం తో పెళ్లి చేసుకున్న ఈ జంటకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
మహేష్ బాబు – నమ్రత

వంశీ సినిమాతో వీరిద్దరి ప్రయాణం మొదలైంది.ఈ సినిమా తర్వాత మహేష్ నమ్రత చాలా ఏళ్ల పాటు రహస్యంగా డేటింగ్ చేశారు.ఇక 2004లో వీరు పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వగా వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
సమంత – నాగచైతన్య

ఏ మాయ చేసావే సినిమాతో మొట్టమొదటిసారి కలిసిన నటించిన సమంత మరియు నాగచైతన్య ఆ సినిమా తర్వాత డేటింగ్ చేయడం మొదలుపెట్టారు.కొన్నేళ్ల పాటు వీరి రహస్య డేటింగ్ బాగానే సాగింది.ఆ తర్వాత అక్కినేని వారి ఇంటి ఆమోదంతో పెళ్లి చేసుకున్నారు.అయితే నాలుగేళ్లు కూడా తిరక్కుండానే వీరిద్దరూ విడిపోయారు.
పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్
బద్రి సినిమాతో రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ కలిసి నటించారు.ఆ తర్వాత ప్రేమలో కూడా పడ్డారు.రేణు దేశాయ్ ఏకంగా పవన్ కోసం తన కెరియర్ ను పణంగా పెట్టి అతడితో జీవితాన్ని మొదలుపెట్టింది.వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టాక విడాకుల బాట పెట్టారు.
నాగార్జున – అమల

టాలీవుడ్ లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ కపుల్ అయిన నాగార్జున అమల 1987లో కిరాయి దాదా( Kirayi Dada ) అనే సినిమాలో మొట్టమొదటిసారి కలిసిన నటించారు.ఈ సినిమా తర్వాత ఒక అయిదారేళ్ల పాటు ప్రేమలో పడ్డారు.ఆ తర్వాత పెళ్లి బంధంతో ఒకటయ్యారు.
రహస్య – కిరణ్ అబ్బవరం

కిరణ్ అబ్బవరం తొలి సినిమా అయినా రాజా వారు రాణి వారు( Raja Vaaru Rani Gaaru ) సినిమాలో రహస్య హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా తర్వాత వీరిద్దరూ ప్రేమలో పడిన ఆ విషయాన్ని మీడియా కంటికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు.ప్రస్తుతం వీరు ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు.త్వరలోనే వీరి పెళ్లికూడా జరగబోతోంది.