మూడోసారి కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది.దేశ ప్రధానిగా నేడు నరేంద్ర మోది( Narendra Modi) ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
దీనికోసం భారీగానే ఏర్పాట్లు చేశారు.ఈరోజు రాష్ట్రపతి భవన్ లో రాత్రి 7.15 గంటలకు ప్రధానిగా నరేంద్ర మోది వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బంగ్లాదేశ్ ప్రధాన మత్రి షేక్ హసీనా, సి సెల్ఫ్ ఉపాధ్యక్షుడు అహ్మద్ ఆపీప్ ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు.
అలాగే నేపాల్ ప్రధాని ప్రచండ, శ్రీలంక అధ్యక్షుడు రనీల్ విక్రమసింగే, మారిషస్ ప్రధాని ప్రవీణ్ కుమార్ జుగ్నాథ్, భూటాన్ ప్రధాని తేర్సింగ్ టోప్గెలు , కూడా ప్రమాణస్వీకారం కి హాజరవుతున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. రాష్ట్రపతి భవన్ లో వివిఐపి లకు, కాబోయే మంత్రులకు ప్రత్యేక ఎన్ క్లోజర్లు ఏర్పాటు చేశారు.
ప్రమాణ స్వీకారం ముగిసిన అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అతిధులకు విందు ఇవ్వనున్నారు.
దీనికోసం భారీగా ఏర్పాట్లు చేశారు. అలాగే పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.ఆది ,సోమవారాల్లో దేశ రాజధాని ఢిల్లీ లో నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించారు.
ఇదిలా ఉంటే మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏ కూటమి 293 సీట్ల తో ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. బిజెపి( BJP )కి సొంతంగా 240 సీట్లు మాత్రమే దక్కాయి .మెజారిటీ పూర్తిస్థాయిలో లేకపోవడంతో ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షలకు మంత్రి పదవులు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.బిజెపికి సొంతంగా మెజారిటీ లేకపోవడంతో ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాలు మంత్రి పదవి విషయంలో భారీ డిమాండ్లను పెడుతున్నాయి.
ఆ డిమాండ్లను తీర్చడం బిజెపికి ఇబ్బందికరంగా మారింది .
ముఖ్యంగా టిడిపి, జెడియు( TDP, JDU )పార్టీలు కేంద్రమంత్రి పదవుల విషయంలో చాలా డిమాండ్లే వినిపిస్తున్నాయి.హోం , ఆర్థిక, రక్షణ , విదేశీ వ్యవహారాలతో పాటు, కీలకమైన విద్య ,సాంస్కృతిక శాఖలను బిజెపి ఉంచుకొని మిగతా శాఖలను మిత్రపక్షలకు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది .మొత్తం మోదీ క్యాబినెట్ లో 30 మంది మంత్రులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇక ఏపీ నుంచి టిడిపి ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు కి కేంద్ర మంత్రి పదవి దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. అలాగే మరో టిడిపి ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కు సహాయం మంత్రి పదవి లభించనున్నట్లు సమాచారం.
జనసేనకు క్యాబినెట్ లో అవకాశం కల్పిస్తే మచిలీపట్నం ఎంపీ బాల శౌరి కి, రాజమండ్రి బిజెపి ఎంపీ దగ్గుపాటి పురందరేశ్వరికి మంత్రి పదవులు దక్కే ఛాన్స్ కనిపిస్తోంది.