స్మార్ట్ ఫోన్ ఒక అత్యవసర వస్తువు అయిపోయింది.ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయాలంటే దాంట్లో చార్జింగ్ తో ఉన్న బ్యాటరీ ఉండాల్సిందే కదా.
ఈ బ్యాటరీని చార్జింగ్ పెడుతున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.అవేంటంటే “
* బేసిగ్ గా మొబైల్ ని ఎప్పుడు చల్లగా ఉండే ప్రదేశాల్లోనే పెట్టాలి.
ఇక చార్జింగ్ చేస్తున్నప్పుడు టెంపరేచర్ తక్కువగా ఉండటం మరింత ముఖ్యం.
* ఫోన్ టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు చార్జింగ్ పెట్టొద్దు.
హీట్ తగ్గాకే బ్యాటరీని చార్జ్ చేయాలి.
* బ్యాటరీ మొత్తం వాడేసి, ఒకేసారి చార్జింగ్ అంతా నింపే బదులు, బ్యాటరీ ఓ 20-30% శాతం ఉండగానే చార్జింగ్ లో పెట్టడం సరైన పద్ధతి.
బ్యాటరీ ఎంత తక్కువగా ఉంటే, రేడియేషన్ అంత ఎక్కువ పెరిగే అవకాశమం ఉంటుంది.
* చార్జింగ్ పెట్టేముందు ఆప్స్ అన్ని క్లోజ్ చేయడం మర్చిపోవద్దు.
కుదిరితే వైఫై ఆపేసి చార్జింగ్ పెట్టుకోవాలి.అలాగైతే త్వరగా చార్జ్ అవుతుంది మొబైల్.
* రాత్రిపూట్ చార్జింగ్ పెట్టేసి పడుకోవడం మంచి అలవాటు కాదు.చార్జింగ్ 100% నిండాక కూడా ప్లగ్ తీసేయకపోతే, బ్యాటరీ లాంగ్ రన్ డ్యూరేషన్ తగ్గిపోతూ ఉంటుంది.
* ఫోన్ ఛార్జింగ్ లో ఉన్నప్పుడు మీడియా ఫైల్స్ ప్లే చేయకూడదు.
* గేమింగ్ మొబైల్ టెంపరేచర్ ని అమాంతం పెంచేస్తుంది.
కాబట్టి చార్జింగ్ లో పెట్టి గేమ్స్ ఆడటం కాని, గేమ్ ఆడిన వెంటనే చార్జింగ్ పెట్టడం కాని చేయకూడదు.