తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో పెద్దపులి అనుమానాస్పదంగా మృతిచెందింది.చంద్రపూర్ జిల్లా వీర్గామ్ సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన పులి మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.కాగా రైలు ఢీకొనడంతో పులి చనిపోయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
పెద్దపులి మహారాష్ట్రకు చెందినదిగా గుర్తించారు.