తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా తన కంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మొదటి నుంచి ఇప్పటివరకు వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకత ఏర్పాటు చేసుకున్నాడు.ఇక ఇప్పుడు ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ ను అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో ఎవరు సాధించలేని క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అటు పాలిటిక్స్, ఇటు సినిమాలు చేస్తూ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాడు.

ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పటికే ఈయన కమిట్ అయిన చాలా సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి.వీటంన్నిటిని ఈ సంవత్సరం పూర్తి చేసి రిలీజ్ చేయాలనే ఆలోచన లో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ ని ఒకప్పుడు మీడియా ముఖంగా తిట్టిన కొంతమంది నటులకు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా పోయాయి.
అందులో ముఖ్యంగా శ్రీరెడ్డి( Sri Reddy ) ఒకరైతే, పోసాని కృష్ణ మురళి ( Posani Krishna Murali )మరొకరు… వీళ్లిద్దరూ పవన్ కళ్యాణ్ ను దూషిస్తూ చాలా మాటలు మాట్లాడారు.

దానివల్లే వాళ్ళని ఇండస్ట్రీలో ఏ సినిమాలో కూడా తీసుకోవడానికి ఆయా దర్శకులు ఇష్టపడడం లేదు ఎందుకంటే ఒకసారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరినైనా వ్యతిరేకించారంటే వాళ్ళు ఎవరు ఆ సినిమాలు చూడరు.కాబట్టి దర్శకులు వీళ్ళను పెట్టుకొని రిస్క్ చేసే కంటే వాళ్ళ ప్లేస్ లో మరో నటుడుని పెట్టుకోవడం బెస్ట్ అని అనుకుంటున్నారు…ఇక అందువల్లే వాళ్ళకి ఏ సినిమాలో కూడా అవకాశాలు రావడం లేదు.ఇక పోసాని ప్రస్తుతం వైసిపి పార్టీ లో మెంబర్ గా కొనసాగుతున్నాడు…ఇక మొత్తానికైతే పోసాని ఆయన సినీ కెరియర్ ను చేజేతులారా ఆయనే నాశనం చేసుకున్నారని చెప్పాలి…
.