ఏపీలో ఎన్నికలు( AP Elections ) దగ్గర పడే గలది రాజకీయం రసవత్తరంగా మారుతుంది.2024 ఎన్నికల వాతావరణం చూస్తుంటే 2019 కంటే చాలా సీరియస్ గా జరగనున్నట్లు తెలుస్తోంది.మరో 60 రోజులలో ఎన్నికలు జరగనున్నాయి.దీంతో ప్రధాన పార్టీలు రకరకాల హామీలు ప్రకటిస్తూ ప్రచారంలో స్పీడ్ పెంచాయి.ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ఒంటరిగా పోటీ చేయనుండగా తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. జాతీయ పార్టీలు( National Parties ) కాంగ్రెస్ మరియు బీజేపీ సైతం ఒంటరిగా పోటీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఏపీలో ఈసారి ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా ఉంది.మరోసారి వైయస్ జగన్( YS Jagan ) రాకూడదని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు అని చంద్రబాబు.పవన్ పక్కా ప్రణాళికలతో ఎన్నికలను ఎదురుకోబోతున్నారు.ఇదిలా ఉంటే తాజాగా వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ( Minister Botsa Satyanarayana ) సీఎం జగన్ కి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి సంబంధించి వ్యక్తిత్వాలపై ట్విట్టర్ లో సంచలన ట్వీట్ చేయడం జరిగింది.“మా ప్రభుత్వం వల్ల మంచి జరిగితేనే ఓటు వేయండి” అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారు.“నేను వేసిన రోడ్లమీద నడుస్తున్నారు.నేనిచ్చిన పింఛన్ తింటున్నారు.నాకెందుకు ఓటు వేయరు?” అనే వ్యక్తి చంద్రబాబు గారు.ప్రజలను గౌరవించే వారే ఈ రాష్ట్రానికి మంచి చేయగలరు.అంటూ బొత్స సత్యనారాయణ ట్వీట్ చేశారు.