సాధారణంగా ఎవరైనా సరే పుట్టినరోజు, నిశ్చితార్థం, పెళ్లి ఇలా ఆనందకరమైన క్షణాలను బంధుమిత్రులతో కలిసి వేడుకగా జరుపుకుంటారు.కానీ చనిపోయినా, పెళ్లి పెటాకులైనా.
ఎంతో దుఃఖంతో కుమిలిపోతారు.ఇలాంటి పరిస్థితుల్లో ఎవరూ కూడా పార్టీలు జరుపుకోరు.
కానీ ఒక మహిళ మాత్రం తన విడాకుల్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది.స్నేహితులను పిలిచి మరీ డివోర్స్ పార్టీ ఘనంగా జరపడంతో.
ప్రస్తుతం ఆ పార్టీ ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.అయితే పాశ్చాత్య దేశాల్లో విడాకులు అనేది సర్వసాధారణ విషయమే.
వారు డివోర్స్ పార్టీ చేసుకుంటే ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు కానీ ఇప్పుడు విడాకుల్ని సెలబ్రేట్ చేసుకున్నది మన భారతీయ మహిళ కావడం గమనార్హం.ఆమె పార్టీ ఇచ్చింది మాత్రం యూకేలో.
భారతీయ సంప్రదాయాలకు, కట్టుబాట్లకు ఇప్పటికీ విలువిచ్చే ఆమె తన వైవాహిక బంధాన్ని కాపాడుకోవాలని మూడేళ్లు విశ్వ ప్రయత్నం చేసింది.తన వైవాహిక బంధాన్ని నిలుపుకుందామని అనుకుంది.
కానీ ఆ క్రమంలో ఆమె తన వ్యక్తిత్వాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది.దాంతో ఆమె తన వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదనే ఉద్దేశంతో 17 ఏళ్ల తర్వాత భర్తకు విడాకులు ఇచ్చేసింది.
ఈ భారతీయ మహిళ పేరు సోనియా గుప్తా.ఆమె 2003లో పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంది.తరువాత భర్తతో కలిసి లండన్ వెళ్లింది.ఆ క్షణం నుంచి ఆమె జీవితం మరింత దయనీయంగా మారింది.
భర్త ఆమెపై ప్రతి విషయంలోనూ ఆన్సర్ పెట్టేవాడు.అత్తింటివారు కూడా ఆమెకు అడుగడుగునా ఆంక్షలు విధించేవారు.
ఇవన్నీ భరించి ఆమె తన భర్తతో కాపురం చేసింది.కానీ సర్దుకుపోతున్నా కొద్దీ ఆమెపై మరిన్ని ఆంక్షలు పెట్టేవారు.
అదేమిటని ప్రశ్నిస్తే గొడవలు పెట్టుకునేవారు.భర్తతో కలిసి ఉండాలని ఆమె పోరాటం చేసింది కానీ అతను మారలేదు.
చివరికి బానిసలా బతకడం కంటే విడాకులు తీసుకోవడమే మేలని ఆమె నిర్ణయించుకుంది.
ఇంటా బయటా మూడేళ్ల పాటు కష్టపడి చివరికి విజయవంతంగా భర్త నుంచి విడాకులు తీసుకుంది.అయితే ఈ సంతోషకరమైన సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంది.తాను కష్టాలను ఎదుర్కొంటున్న సమయంలో తన వెన్నంటే ఉండి అండగా నిలిచిన కొందరు స్నేహితులను, ఆత్మీయులను పిలిచి పార్టీ ఇచ్చింది.
ఫైనల్లీ డివోర్స్‌డ్ అని ప్రింట్ చేసిన డ్రెస్ ధరించి ఆమె విడాకుల వేడుకలు జరుపుకుంది. బౌన్సీ కాసిల్, గులాబీ, ఊదా రంగులతో డెకరేషన్స్ చేసిన స్టేజిపై సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
ఇంద్రధనస్సు, యునికార్న్ థీమ్‌తో పాటు కస్టమ్ కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు.కాగా, ప్రస్తుతం ఈ విడాకుల పార్టీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.