టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ తేజకు( Director Teja ) ప్రత్యేక గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే.తేజ డైరెక్షన్ లో కెరీర్ తొలినాళ్లలో తెరకెక్కిన సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించాయి.
ఎవరైనా సీన్ లో సరిగ్గా యాక్ట్ చేయకపోతే ఈ డైరెక్టర్ కొడతాడని కూడా ఇండస్ట్రీలో టాక్ ఉంది.కొంతమంది హీరోలు, హీరోయిన్లు పలు సందర్భాల్లో ఈ విషయాలను వెల్లడించారు.
అయితే దర్శకుడు తేజను ఒక హీరో ( Hero ) ఇబ్బంది పెట్టాడని తెలుస్తోంది.
తేజ డైరెక్షన్ లో తెరకెక్కిన ఒక సినిమా త్వరలో థియేటర్లలో విడుదల కానుంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ కుటుంబానికి చెందిన ఈ హీరో నుంచి నటన రాబట్టుకోవడానికి తేజ ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు వర్కౌట్ కాలేదని సమాచారం.ఆ హీరో యాక్టింగ్ ను భరించలేక తేజ క్లైమాక్స్ ను కూడా కొత్తగా ప్లాన్ చేశాడని తెలుస్తోంది.
క్లైమాక్స్ లో హీరో ఫేస్ కనిపించకుండా సన్నివేశాన్ని షూట్ చేశారని సమాచారం.
స్టార్ కుటుంబాలకు చెందిన చాలామంది హీరోలు కెరీర్ పై సరిగ్గా దృష్టి పెట్టడం లేదని అందువల్లే కెరీర్ పరంగా సక్సెస్ కాలేకపోతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు తేజ తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ సాధించాల్సి ఉంది.తేజ ఒక్క హిట్ సాధిస్తే ఆయనకు ఛాన్స్ ఇవ్వడానికి చాలామంది హీరోలు సిద్ధంగా ఉన్నారు.
తేజ రెమ్యునరేషన్( Teja Remuneration ) ప్రస్తుతం పరిమితంగానే ఉందని తెలుస్తోంది.
తేజకు ప్రేక్షకుల్లో అంతకంతకూ క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.ఈతరం హీరోలలో కూడా చాలామంది తేజ డైరెక్షన్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.తేజ సినిమాలు పరిమిత బడ్జెట్ లోనే తెరకెక్కుతూ నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తుండటం గమనార్హం.
తేజ కథ, కథనం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.