ప్రతీ వారం లాగే ఈ వారం కూడా థియేటర్లోకి, ఓటీటీ లోకి విడుదల అవ్వడానికి కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు రెడీగా ఉన్నాయి.అలా ఈ వారం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మొత్తం సందడి సందడిగా ఉండబోతోంది.
మరి ఈ వారం ఏ ఏ సినిమాలు విడుదల కాబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఈ వారం తెలుగులో 8 సినిమాలు విడుదలవుతుండగా అందులో రెండు డబ్బింగ్, 6 స్టైయిట్ తెలుగు సినిమాలు ఉన్నాయి.
వీటితో పాటు హిందీలో 9 సినిమాల వరకు విడుదలవుతుండగా టబు,కరీనా, క్రితి సనన్ నటించిన క్రూ ( Crew ) రెండు డబ్బింగ్ చిత్రాలు మాత్రమే చెప్పుకోతగినవి, కాగా మిగతావన్ని చిన్న సినిమాలే.

ఇక ఇంగ్లీష్ లో రెండు, తమిళంలో 3, కన్నడలో 1 చొప్పున చిత్రాలు మార్చి 29న విడుదల కానున్నాయి.ఇదిలాఉండగా ఈ వారం అందరి దృష్టి కేవలం రెండు, మూడు సినిమాలపై మాత్రమే ఉంది.అందులో ప్రధానమైనది గాడ్జిల్లా Vs కాంగ్( Godzilla Vs Kong ) అనే హాలీవుడ్ సినిమా శుక్రవారం రిలీజవుతున్న క్రమంలో ఎప్పుడూ, ఏ సినిమాకు రానంతగా హైప్ అంతకంతకు పెరుగుతూ వస్తోంది.

దీంంతో ప్రపంచవ్యాప్తంగా అందరి ఫస్ట్ మస్ట్ వాచ్ లిస్ట్‌లో ఈ సినిమానే ఉండనుంది.ఇక దీని తర్వాత మలయాళ స్టార్ ఫృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన గోట్ లైప్( Goat Life ) సినిమాకు దేశ వ్యాప్తంగా మంచి బజ్ ఏర్పడగా,

మన రెండు తెలుగు రాష్ట్రాలలో టిల్లు స్క్వేర్( Tillu Square ) చిత్రం కోసం యూత్ ఆసక్తిగా ఎదురు చూస్తోంది.ది గోట్ లైఫ్ అనే అడ్వెంచర్ డ్రామా సినిమా మార్చి 28న విడుదల కానుంది అలాగే తలకోన( Talakona ) అనే సినిమా కూడా మార్చి 29న విడుదల కానుంది.బహుముఖం( Bahumukham ) అనే సినిమా కూడా మార్చి 29 విడుదల కానుంది.
సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన టిల్లు స్క్వేర్ సినిమా కూడా మార్చి 29న విడుదల కానుంది.అలాగే అగ్రిక్రొస్ అనే సినిమా మార్చి 29 విడుదల కానుంది.
కళియుగం పట్టణంలో( Kaliyugam Pattanamlo ) మార్చి 29న విడుదల కానుంది.