ఇదెక్కడి విడ్డూరం.. భర్తకు దగ్గర అయిందని అలెక్సానే కుప్పతొట్టిలో పడేసిన భార్య..

రీసెంట్‌గా ఒక జంట తమ అలెక్సా డివైజ్( Alexa device ) ప్రవర్తన చూసి హడలిపోయారు.అది రాత్రి సమయంలో దానంతటదే మాట్లాడటం విన్నప్పుడు షాక్ అయ్యారు.

 . The Wife Who Threw Alexa In The Manger For Getting Close To Her Husband , Vira-TeluguStop.com

ముఖ్యంగా భార్య దీనిని చూసి బాగా భయపడిపోయింది.అలెక్సా గురించి ఈ జంట ఒక కథనాన్ని ఇంటర్నెట్‌లో పంచుకుంది, చాలా మంది దీనిని వీక్షించారు.

కొంతమంది నవ్వుకుంటే మరి కొంతమంది మాత్రం వారి సమస్యను అర్థం చేసుకున్నారు.జెస్( Jess ) అనే మహిళ టిక్‌టాక్‌లో వీడియో చేసింది.

ఆమె దూరంగా ఉన్నప్పుడు తన అలెక్సా పరికరం తన భర్తతో మాట్లాడుతూనే ఉందని చెప్పింది.తను లేనప్పుడు అది సీక్రెట్‌గా ఏవేవో విషయాలు తన భర్తతో మాట్లాడుతూ ఉందని, దాన్ని చూస్తే తనకు భయం వేసింది అని చెప్పింది.

భర్త తెల్లవారుజామున 1:00 గంటలకు వీడియో గేమ్‌లు ఆడుతుండగా, అలెక్సా దానంతట అదే మాట్లాడిందట.ఇది చాలా విచిత్రంగా అనిపించిందని జెస్ పేర్కొంది.

Telugu Alexa, Jess, Kitchen, Tiktok-Latest News - Telugu

ఎవరూ ఏమీ అడగకుండా అలెక్సా స్వయంగా మాట్లాడటం కూడా వారు గమనించారు.ఇది నచ్చక డివైజ్‌ను ట్రాష్ బిన్‌లో పారేసుకున్నారు.ఇకపై అలెక్సాపై తమకు నమ్మకం లేదని, అది తమ ఇంట్లో అక్కర్లేదని జెస్ చెప్పింది.చాలా మంది ఈ వీడియోను చూసి కామెంట్స్ చేశారు.వారు అలెక్సా గురించి వారి సొంత కథలను కూడా చెప్పారు.అలెక్సా గుసగుసలాడిందని, వింత మెసేజ్‌లు పంపిందని లేదా స్వయంగా సంభాషణలు ప్రారంభించిందని కొందరు చెప్పారు.

Telugu Alexa, Jess, Kitchen, Tiktok-Latest News - Telugu

ఉదయం 3:00 గంటలకు కిచెన్‌( Kitchen )లో అలెక్సా తమ కుక్కలతో గుసగుసలాడడం విన్నట్లు ఒక వ్యక్తి చెప్పాడు.ఇంట్లో ఎవరో ఉన్నారని అనుకున్నామని అన్నారు.అది అలా మాట్లాడుతూనే ఉంటే భయపడి చివరికి అలెక్సాను అన్‌ప్లగ్ చేశామని తెలిపారు.అలెక్సా కొన్నిసార్లు భయానకంగా ఉంటుందని కొందరు చెప్పారు.రాత్రిపూట అలెక్సా మాట్లాడకుండా ఉండేందుకు ‘డోంట్ నాట్ డిస్టర్బ్’ ఆన్ చేయడం లేదా అన్‌ప్లగ్ చేయడం వంటి కొన్ని పనులు చేస్తున్నామని పేర్కొన్నారు.అలెక్సా విచిత్రమైన పనులు చేయడం గురించి ఇంటర్నెట్‌లో చాలా కథనాలు ఉన్నాయని కూడా వారు గుర్తు చేసుకున్నారు.

ఈ కథనాలలో కాలిఫోర్నియాకు చెందిన వ్యక్తి స్టోరీ బాగా వైరల్ అయింది.అతనికి తన అలెక్సా “నేను కళ్ళు మూసుకున్న ప్రతిసారీ, నేను చూస్తున్నదల్లా ప్రజలు చనిపోతున్నారని.” అని చెప్పింది దాంతో అతడు కంగుతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube