తిరుమల కొండపై నుంచి మరోసారి విమానం చక్కర్లు కొట్టింది.శ్రీవారి ఆలయం మీదుగా విమానం వెళ్లిందని తెలుస్తోంది.
ఆలయ గోపురం, గొల్ల మండపానికి మధ్య నుంచి వెళ్లడం కలకలం సృష్టించింది.
ఇటీవల తిరుమల కొండపై నుంచి విమానాలు వెళ్లడం పరిపాటిగా మారడంతో భక్తులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ఆగమ శాస్త్రాలకు విరుద్ధమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని శ్రీవారి భక్తులు విన్నవిస్తున్నారు.
గతంలోనూ ఈ విధంగా విమానాలు వెళ్లడంపై టీటీడీ అధికారులు కేంద్ర పౌరవిమానయాన అధికారులతో చర్చించిన ఎటువంటి స్పందన లేదన్న సంగతి తెలిసిందే.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి శ్రీవారి ఆలయంపై నుంచి ఎటువంటి విమానాలు, హెలికాప్టర్లు వెళ్లకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.