అగ్ర రాజ్యం అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో మహిళలు అందరూ రోడ్డెక్కి నిరసనలు చేపట్టారు.తమకు న్యాయం చేయాలని గొంతెత్తి అరుస్తున్నారు.
ఏళ్ళ తరబడి సాగుతున్న ఈ ఉద్యమానికి ప్రభుత్వం నుంచీ ఎలాంటి స్పందన లేకపోగా, కోర్టులు సైతం వారికి సానుకూలంగా తీర్పులు ఇవ్వక పోవడంతో తమ ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు.ఇంతకీ ఈ మహిళలు అందరూ ఎందుకోసం ఈ నిరసనలు, ప్రభుత్వాలు, కోర్టులు ఎందుకు వీరికి అనుకూలంగా లేవు.
అమెరికాలోని అడవి ప్రాంతాల్లో ఉండే గిరిజన మహిళలకు అబార్షన్ అనేది అతిపెద్ద సమస్యగా మారింది.అదేంటి అబార్షన్లు సమస్య ఏంటి అసలు అబార్షన్లు ఎందుకు చేయించుకోవాలి అంటే.
అమెరికాలో గిరిజన ప్రాంతాలు ఎన్నో పేదరికంలో ఉన్నాయి.అక్కడ పిల్లలను కని పెంచడం అనే ఆర్ధిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్టే.
ముఖ్యంగా గిరిజన మహిళలపై దొంగలు చేస్తున్న దాడులు, అత్యాచారాలతో ఎంతో మంది గర్భం దాల్చుతున్నారు.దాంతో వారు అబార్షన్ చేయించుకోవాలి అనుకున్నా వీలు లేకుండా పోతోంది ఎందుకంటే.
టెక్సాస్ రాష్ట్రం అబార్షన్ చేయించుకోవడం బ్యాన్ విధించింది.దాంతో వారికి పిల్లలను కనడం తప్పని పరిస్థితి అయ్యింది.దాంతో అటు వారిపై జరుగుతున్నా అత్యాచారాలకు గాను పుట్టిన పిల్లలను పెంచి పోషించలేక అబార్షన్ దారి పడుతున్నారు.ఈ క్రమంలోనే ప్రభుత్వానికి తమ పరిస్థితులను వివరించి ఎన్ని సార్లు అభ్యర్ధన పెట్టినా ఫలితం లేకపోయింది.
దాంతో గిరిజన మహిళలు కోర్టును ఆశ్రయించారు.కానీ వారికి అక్కడ కూడా చుక్కెదురయ్యింది.
ప్రభుత్వం నిర్ణయానికి మద్దతు తెలుపుతూ కోర్టు తీర్పు చెప్పింది.
కోర్టు ఇచ్చిన తీర్పుపై పలు స్వచ్చంద సంస్థలు మండిపడుతున్నాయి.
ముఖ్యంగా అమెరికన్ విమెన్ హెల్త్ ఎడ్యుకేషన్ రీసోర్స్ సెంటర్ డైరెక్టర్ కారాన్ మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న దాడుల నేపధ్యంలో ఈ తీర్పు సరైనది కాదని అన్నారు.గిరిజన మహిళలపై జాలి చూపాలని తరచుగా గర్భం రావడం వలన వారు అనారోగ్యం పాలవుతున్నారని ఆమె ఆవేదన చెందారు.
అయితే టెక్సాస్ రాష్ట్రం స్పందించే వరకూ కూడా తమ పోరాటం ఇలానే కొనసాగుతుందని ఆమె తెలిపారు.దాంతో గిరిజిన మహిళల తరుపున టెక్సాస్ వ్యాప్తంగా మహిళలు స్వచ్చందంగా నిరసనలు తెలుపుతూ వారికి మద్దతు నిలుస్తున్నారు.