ఏపీలో కొత్త‌చిచ్చు రేపుతున్న బీజేపీ.. ఫైర్ అవుతున్న వైసీపీ

ఏదైనా చిన్న విష‌యాన్ని రాజ‌కీయం చేయాలంటే అది బీజేపీ త‌ర్వాతే ఎవ‌రైనా అని చెప్పాలి.

వారు మ‌రీ ముఖ్యంగా హిందువుల‌కు సంబంధించిన విష‌యాల్లో చిన్న పొర‌పాటు లాంటిది క‌నిపించినా స‌రే దాన్ని వ‌ద‌ల‌కుండా రాజకీయాలు చేస్తూ చిర‌వ‌కు త‌మ‌కు ల‌బ్ధి చేకూరే విధంగా చూసుకుంటున్నారు.

ఇప్ప‌టికే ఈ విష‌యం తెలంగాణ రాజకీయాల‌ను చూస్తేనే అర్థం అవుతోంది.కాగా ఇప్పుడు ఏపీలో కొత్త చిచ్చు రాజేసేందుకు రెడీ అవుతున్నారు బీజేపీ నేత‌లు.

ఇక ఇప్పుడు వినాయ‌క చ‌వితి వస్తున్న సంద‌ర్భంగా మ‌రో కొత్త వివాదానికి తెర లేపుతున్నారు.ఇప్పుడు థర్డ్ వేవ్ సంద‌ర్భంగా జగన్ సర్కార్ ప‌రిస్థితుల‌పై సమీక్షించి వినాయ‌క చ‌వితి వేడుకలపై కొన్ని ఆంక్షలు విధించింది.

అయితే ఈ ఆదేశాలపై ఇప్పుడు ఏపీ బీజేపీ కొత్త రాజ‌కీయాల‌కు తెర లేపింది.ప్ర‌స్తుతం ఏపీలో క‌రోనా ఎఫెక్ట్ కార‌ణంగా ఎప్ప‌టి నుంచో రాత్రి 11 గంటల నుంచి తెల్ల‌వారు జామున ఉదయం 6గంటల దాకా నైట్ కర్ఫ్యూ సాగుతున్న విష‌యం అంద‌రికీ విదిత‌మే.

Advertisement

ఈ నేప‌థ్యంలో చవితి వేడుకలను ఏపీలో ఇండ్ల వ‌ర‌కే పరిమితం చేయాలని బ‌హిరంగ ప్ర‌దేశాల్లో అన‌గా పబ్లిక్ ఏరియాల్లో చవితి వేడుకలు నిర్వ‌హించ‌వ‌ద్ద‌ని ఆదేశాలు ఇస్తోంది.

దీంతో ఏపీ బీజేపీ అగ్గి రాజేస్తోంది.ఎందుకంటే గ‌తంలో ఏ పండుగల‌కూ ఈ విధ‌మైన ఆంక్షలు పెట్ట‌కుండా కేవ‌లం చ‌వితి పండుగ‌లు అన‌గా హిందువుల పండుగలకు ఎందుకు పెడుతున్నారంటూ మండిప‌డుతోంది.ఇప్ప‌టికే రాష్ట్రంలో స్కూళ్లు తెరిచారని ఇంకోవైపు పేరెంట్స్ పిల్లలను కూడా స్కూళ్ల‌కు పంపిస్తున్నారు కాబ‌ట్టి అన్ని ర‌కాల కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న త‌రుణంలో గణేష్ పండుగకు ఎందుకు ఆంక్ష‌లు విధిస్తున్నారంటూ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిప‌డుతున్నారు.

విధ‌ఙంచిన ఆంక్షల‌ను ఎత్తివేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.ఇక సోష‌ల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ఈ డిమాండ్ వ‌స్తోంది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు