హీరోయిన్ ఇవానా ( Ivana ) అనే పేరు చెప్తే చాలామంది తెలియకపోవచ్చు.కానీ లవ్ టుడే హీరోయిన్ ఇవానా అంటే అందరికీ ఇట్టే గుర్తుకొస్తుంది.
ఈమె లవ్ టుడే సినిమాతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించింది.ఇక ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ ( Pradeep ranganathan) హీరోగా చేస్తే సీనియర్ నటి రాధిక,యోగి బాబు వంటి వాళ్ళు కీలక పాత్రల్లో నటించారు.
అయితే ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అవడంతో దీన్ని తెలుగులో కూడా రీమేక్ చేశారు.అలా తెలుగులో రీమేక్ అయినా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో యూత్ కి కలల రాకుమారిగా మారిపోయింది ఇవానా.
ఇక ఇవానా అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో పాల్గొని నాకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం అంటూ కూడా చెప్పుకొచ్చింది.

అయితే తాజాగా విజయ్ దళపతి ( Vijay dalapathy ) సినిమాలో ఇవానాకి నటించే అవకాశం వచ్చిందట.కానీ ఆ సినిమాని ఇవానా రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.అయితే ఈ విషయం తెలిసి చాలామంది నెటిజెన్లు ఇదేంటి అంత పెద్ద స్టార్ హీరో సినిమాలో అవకాశం వస్తే ఎవరైనా ఎగిరిగంతేస్తారు.
కానీ ఈమె ఏంటి అలా రిజెక్ట్ చేసింది అని అందరూ మాట్లాడుకుంటున్నారు.అయితే ఇవానా స్టార్ హీరో విజయ్ సినిమాలో అవకాశాన్ని వదులుకోవడానికి ప్రధాన కారణం విజయ్ సినిమాలో ఆమెకు చెల్లెలిగా నటించే అవకాశం వచ్చిందట.

ఇక విషయంలోకి వెళ్తే.విజయ్ తాజాగా నటించబోతున్న 68వ సినిమాలో మీనాక్షి చౌదరి ( Meenakshi choudary ) హీరోయిన్గా చేస్తుంది.అయితే ఈ సినిమాలో విజయ్ దళపతికి చెల్లెలుగా నటించే అవకాశం హీరోయిన్ ఇవానా కి వచ్చిందట.కానీ హీరోయిన్ గా అయితే ఓకే కానీ చెల్లెలుగా నటిస్తే మళ్ళీ అలాంటి పాత్రలే వస్తాయి అనే భయంతో ఇవానా విజయ్ సినిమాలో వచ్చిన అవకాశాన్ని రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.
అయితే కొంతమంది ఈ విషయంలో ఇవానాని సపోర్ట్ చేస్తే మరి కొంత మంది తిట్టిపోస్తున్నారు.కానీ ఇవానా ( Ivana ) మాత్రం ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే అందరూ తనని చెల్లెలి పాత్రలోనే తీసుకుంటారు అనే భయంతోనే విజయ్ సినిమాని రిజెక్ట్ చేసినట్టు సమాచారం.