సినీ నటి నయనతార, విఘ్నేష్ శివన్ దంపతుల కవల పిల్లల వ్యవహారంలో అధికారుల కమిటీ విచారణ పూర్తి అయింది.ఈ నేపథ్యంలో రేపు తమిళనాడు ప్రభుత్వానికి కమిటీ నివేదిక అందించనుంది.
సరోగసీ విధానంలో నయనతార, విఘ్నేష్ దంపతులు కవల పిల్లలకు తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే.అయితే సరోగసీ విధానం నిషేధించబడటంతో పలు విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ క్రమంలో పిల్లల వ్యవహారంపై స్పందించిన తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యన్ విచారణకు కమిటీని నియమించారు.నయనతార దంపతుల సరోగసి ప్రక్రియ చట్టబద్దంగా జరిగిందా.? లేదా.? అనే విషయంపై కమిటీ విచారణ జరిపింది.