ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ మేరకు సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ను న్యాయస్థానం విచారించింది.
ఏసీబీ కోర్టు తన పరిధి దాటి వ్యవహరించిందని అడ్వకేట్ జనరల్ న్యాయస్థానానికి తెలిపారు.మెమో రిజెక్ట్ చేసే అధికారం ఏసీబీ కోర్టుకు ఉన్నా క్వాష్ పిటిషన్ ఆర్డర్ లా ఉందని ఏజీ పేర్కొన్నారు.
పిటిషన్లపై వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.